Gold Price Today : నన్ను కొనడం మీ వల్ల అవుతుదా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి

Update: 2025-07-13 03:15 GMT

బంగారం ధరలు మరింత ఎక్కువవుతాయని అందరూ చెబుతున్నట్లుగానే జరుగుతుంది. ఆషాఢమాసంలో నైనా ధరలు దిగివస్తాయనుకుంటే నిరాశతో గోల్డ్ లవర్స్ కు నీరసం తప్పడం లేదు. శ్రావణమాసంలో ధరలు పెరుగుతాయని ముందుగానే కొనుగోలు చేయాలని భావించి ఆషాఢమాసంలో కొనుగోలు చేయడానికి ప్రయత్నించినా ధరలు ఏ మాత్రం తగ్గకపోగా మరింతగా పెరుగుతున్నాయి. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో ముందుగానే బంగారాన్ని కొనుగోలు చేద్దామనుకున్నా ధరలు భయపెడుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకున్న వారు ఆషాడంలో ధరలు అందుబాటులో ఉంటాయనుకుంటే వారికి షాకిస్తున్నాయి.

రెండు సార్లు...
బంగారం ధరలు ఇప్పటి వరకూ రెండుసార్లు లక్ష రూపాయలకు టచ్ చేసి వచ్చాయి. ఇప్పుడు మరోసారి లక్ష రూపాయలు టచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ నెలలో లక్షకు చేరిన బంగారం ధర, మరోసారి మే నెలలో లక్ష రూపాయలు దాటింది. బంగారాన్ని కొనుగోలు చేద్దామని వెళ్లిన వారిని ధరలు వెక్కిరిస్తున్నాయి. నన్ను కొనడం నీవల్ల అవుతుందా? అన్న రేంజ్ లో చూస్తున్నట్లు కనపడుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్న ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో ప్రతి రోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు.
సీజన్ దగ్గరపడే కొద్దీ...
ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడే కొద్ద బంగారం ధరలు మరింతగా పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది. బంగారం లేకుండా వివాహం జరగని పరిస్థితుల్లో అప్పులు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,710 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,25,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.








Tags:    

Similar News