Gold Price Today : మంగళవారం షాకిచ్చిన పసిడి.. ధరలు ఎంత పెరిగాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
పసిడి ప్రియులకు వరసగా ధరలు షాకిస్తున్నాయి. పెరుగుతూనే పోతున్నాయి. ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎందుకన్న కారణాలు పక్కన పెడితే ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పసిడి ధరలు మరింతగా పెరుగుతూ వినియోగదారుల ఆశలను గల్లంతు చేస్తున్నాయి. పసిడి ధరలు ప్రతి రోజూ పెరగడం వల్ల కొనుగోళ్లు కూడా దారుణంగా తగ్గాయి. సీజన్ తో సంబంధం లేకుండా పెరిగే ఏకైక వస్తువు బంగారం మాత్రమే. బంగారానికి ఒక రోజు లేదు. ఒక సీజన్ ఉండదు. దాని ధరలు పెరగాలనుకున్నప్పుడు డిమాండ్ కూడా పెద్దగా అడ్డురాదు. అందుకే గోల్డ్ ధరలు పెరగడంతో ఇక కొనుగోళ్లు మరింత తగ్గుతాయని అంచనాల వినపడుతున్నాయి.
అనేక కారణాలతో...
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, దిగుమతులు తగ్గడం వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో డిమాండ్ లేకపోయినా సరే ధరలు పెరుగుతూ వస్తుండటంతో కొనుగోళ్లు నిలిచిపోయినా ధరలు అదుపులోకి రాకపోవడానికి కూడా కారణం బంగారం ముడి సరుకు కొరత కారణమని చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం లేదంటూ అంచనాలు బలంగా వినపడుతున్నాయి.
వెండి మాత్రం...
పసిడి పది గ్రాముల ధర ఇప్పటికే లక్ష రూపాయలు దాటేసింది. వెండి కూడా భారీగా పెరిగింది. మరో మూడు రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ధరలు పెరగడం ఆందోళనకు గురి చేస్తుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 130 రూపాయల వరకూ పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,180 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,160 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,25,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.