Gold Rates Today : లక్ష దాటేసిన బంగారం ధరలు.. ఇక కొనుగోలు చేయడం కష్టమే

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది

Update: 2025-07-23 02:57 GMT

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో శ్రావణమాసం ప్రారంభం కానుండటంతో ధరలు మరింత ఎగబాకనున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా అంచనాలకు అందకుండా పెరుగుతున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. కిలో వెండి ధర లక్షా ముప్ఫయివేలకు చేరువలో ఉంది. ఇంత భారీ స్థాయిలో పెరిగినా రానున్నది శ్రావణ మాసం కావడంతో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపడుతున్నాయి. భారీగా పసిడి, వెండి ధరలు పెరుగుతుండటంతో దాని ప్రభావం వాటి కొనుగోళ్లపై భారీగా పడిందని వ్యాపారులు చెబుతున్నారు.

మరింత పెరుగుతూ...
బంగారం ధరలు మరింత పెరగడానికి అనేక కారణాలున్నాయి. సీజన్ కాకున్నా, డిమాండ్ లేకపోయినా ధరలు పెరగడం చూస్తుంటే ఒక రీజన్ లేకుండా ధరలు పెరుగుతున్నాయన్న భావన అందరిలోనూ కలుగుతుంది. బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. బంగారంపై పెట్టుబడి పెట్టేవారు సయితం వెనుకంజ వేస్తున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు మార్కెట్ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.
నేటి ధరలు ఇలా...
పది గ్రాముల బంగారం కొనుగోలు చేయాలంటే లక్ష రూపాయలకు పైన వెచ్చించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా తరుగు, జీఎస్టీ వంటి ఛార్జీలు కూడా తోడవ్వడంతో తడిసి మోపెడవుతున్నాయి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,860 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,300 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,28,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.




Tags:    

Similar News