Gold Price Today : గోల్డ్ లవర్స్ కు షాక్ ల మీద షాక్ లు.. ఇక కొనడం కష్టమేనా?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు తగ్గుతాయని ఎవరు చెప్పారో కానీ.. ఈ ఏడాది అతి ముఖ్యమైన జోక్ గా భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర యాభై ఐదు వేల రూపాయలకు చేరుకుంటుందని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే అందుకు విరుద్ధంగా బంగారం, వెండి ధరలు ఆల్ టైం హైకి చేరుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధరపై 1,650 రూపాయలు పెరిగింది. దీంతో లక్ష రూపాయలకు చేరువలో తులం బంగారం వచ్చినట్లే అనిపిస్తుంది. ఇలా ధరలు పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు వ్యాపారులు. ఒక్కసారిగా ధరలు ఇంత భారీగా పెరగడంతో వినియోగదారులు మాత్రం కొనుగోలు చేయాలా? వద్దా? అన్న మీమాంసలో పడిపోయారు.
అనేక కారణాలతో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావం కూడా బంగారం ధరల పెరుగుదల పై పడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ కూడా ధరల్లో మార్పునకు కారణమని తెలుస్తోంది. ఇది మరింతగా పెరిగే అవకాశాలు తప్పించి తగ్గే సూచనలు లేవని బిజినెస్ నిపుణులు అంటున్నారు. బంగారం పై పెట్టుబడి పెట్టే వారు కూడా ధరలు తగ్గుతాయామోనని భావించి నిన్నటి వరకూ జంకిన వారు నేడు కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో పాటు అక్షర తృతీయ కూడా వస్తుండటంతో ధరలు ఇంకా పెరుగుతాయన్న అంచనాలు బాగానే మార్కెట్ లో వినిపిస్తున్నాయి.
భారీగా పెరిగి...
బంగారం అంటే ఇప్పుడు దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. శుభకార్యాలకు విధిగా బంగారం కొనుగోలు చేయాల్సి రావడంతో తప్పనిసరిగా ఎంతో కొంత కొనుగోలు చేసి మమ అనిపించేస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టే వారు కూడా ఒకింత ఆలోచనలో పడినట్లే కనిపిస్తుంది. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం 87,200 రూపాయల వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాుముల బంగారం ధర 96,170 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,10,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.