Gold Price Today : బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. కొనుగోళ్లు అదే స్థాయిలో తగ్గాయిగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర తగ్గింది.
బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశముందని ముందు నుంచే చేస్తున్న హెచ్చరికలు నిజమవుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే 87 వేల వరూపాయలకు చేరువలో ఉంది. కిలో వెండి ధర లక్షా ఏడు వేల రూపాయలుకు చేరుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి పరుగు ప్రారంభించిన పసిడి ఇక ఆగలేదు. వెండి ధరలు కూడా పెరుగుతుండటంతో కొనుగోలు దారులు కూడా వెనకంజ వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. బంగారం మాటెత్తితేనే ఇంట్లో గొడవలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయంటూ ఛలోక్తులు కూడా వినపడుతున్నాయి.
కొనుగోళ్లు లేక...
ఇక పెళ్లిళ్ల సీజన్ లో గతంలో మంగళసూత్రానికి ఎక్కువ బంగారాన్ని వినియోగించే వారు. కానీ ఇప్పుడు ధరలు ఎక్కువగా పెరగడంతో బంగారం తగ్గించి మంగళసూత్రాలను సన్నగానే చేయించుకునే పరిస్థితికి వచ్చారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో పాటు బంగారం ఇప్పుడు కొనుగోలు చేస్తే తర్వాత తగ్గితే నష్టపోతామని భావించి అనేక మంది వెనకడుగు వేస్తున్నారు. ఈ సీజన్ లో రద్దీగా ఉండే జ్యుయలరీ దుకాణాలు బోసి పోయి కనిపిస్తున్నాయి. ఒకరు అరా వినియోగదారులు వచ్చినా వారు గ్రాము బంగారం ధర కనుక్కుని వెనుదిరిగి వెళ్లిపోతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో తులం బంగారం కొంత అందుబాటులో ఉండేదని, ఇప్పుడు గ్రాము కొనాలన్నా భారంగా మారిందని అంటున్నారు.
నేటి ధరలు...
ఇలాగే బంగారం ధరలు పెరుగుతూ పోతే కొనుగోళ్లు పూర్తిగా పడిపోయే అవకాశాలున్నాయి. బంగారం పై ఎంత ఇష్టమున్నప్పటికీ అంత ధర పెట్టి కొనుగోలు చేయడం మాత్రం వేస్ట్ అన్న భావనలోకి వచ్చేశారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరగగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,410 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,630 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,07,900 రూపాయలుగా ఉంది.