Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది.
బంగారం ధరలు మండి పోతున్నాయి. పట్టుకుంటేనే భగభగమంటున్నాయి. లక్ష రూపాయలకు పది గ్రాముల బంగారం ధర తగ్గనంటుంది. బంగారానికి డిమాండ్ లేని రోజుల్లోనూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలా పెరగడం అంటే ధరలు ఏ రేంజ్ లోకి వెళతాయన్నది అర్థం కాకుండా ఉంది. వెండి ధరలు కూడా బంగారం కంటే ముందు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ బంగారం, వెండి ధరలు ఇలా పెరగలేదు. ఇలా పెరిగినట్లు హిస్టరీలోనే లేదంటున్నారు వ్యాపారులతో పాటు మార్కెట్ నిపుణులు. అనేక కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ ధరలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు కొనుగోలు చేయలేని స్థితికి చేరుకున్నారు.
తగ్గుతాయని కొందరు...
అంతర్జాతీయంగా బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో ధరలు ఇంకా పెరిగితే అమ్మకాలు మరింతగా పడిపోతాయన్న ఆందోళన వినియోగదారులలో వ్యక్తమవుతుంది. మరొకవైపు బంగారం ధరలు భారీగా పతనమయ్యే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక గుడ్ రిటర్న్స్ వచ్చే వస్తువు బంగారంపై పెట్టుబడి పెట్టే వారు సయితం ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు రాకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంతే కాదు.. పెళ్లిళ్ల సీజన్ ముగిసి ప్రస్తుతం మూఢమి నడుస్తుండటంతో బంగారం క్రయ విక్రయాలు కూడా భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ధరలు ఇంకా పెరిగితే అమ్మకాలు పూర్తిగా పడిపోతాయంటున్నారు.
స్వల్పంగా పెరిగి...
బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అందులోనూ మహిళలు అత్యంత ఇష్టపడే బంగారు ఆభరణాల ధరలు పెరగడంతో జ్యుయలరీ దుకాణాలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే అందుకు కూడా స్పందన పెద్దగా లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,660 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర1,01,100 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,22,100 రూపాయలుగా కొనసాగుతుంది.