Gold Price Today : బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు .. ఈరోజు ఎంతంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది.

Update: 2025-05-31 03:00 GMT

బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. అంటే దాదాపు రోజూ ధరలు పెరుగుతుండటం బంగారానికి అలవాటు. అలాగే వెండి ధరలు కూడా దానితో సమానంగా పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు టచ్ చేసి తిరిగి తగ్గినప్పటికీ ఇంకా ధరలు అందుబాటులోకి మాత్రం రాలేదు. అందుకే ధరలు పెరిగినప్పుడల్లా బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. అనేక కారణాలతో ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.

స్టేటస్ సింబల్ గా...
బంగారం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే స్టేటస్ సింబల్ గా మారింది. అదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుంది. శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయని వ్యాపారుల అంచనా వేసినా గత కొన్ని నెలలుగా మాత్రం ఆశించిన రీతిలో అమ్మకాలు జరగడం లేదు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేద్దాములే అన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏ మాత్రం తగ్గడం లేదు. ధరలు తగ్గినప్పటికీ స్పల్పంగానే తగ్గుతున్నాయి. పెరిగినప్పుడు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఇది దుకాణదారుల్లో ఆందోళన నెలకొంది. అమ్మకాలు ఇంత దారుణంగా పడిపోతాయని ఊహించలేదని అంటున్నారు.
బంగారం స్వల్పంగా పెరిగి...
అలాగే దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే వారు ఎక్కువగా ఉంటారు. జ్యుయలరీ దుకాణాల యజమానులు భారీ ఆఫర్లు ప్రకటించినప్పటికీ వినియోగదారులు దుకాణాల గడప తొక్కడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది.పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ప్రకారం ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,210 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,320 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,10,800 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News