Gold Price Today : గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగినా ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదట

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది

Update: 2025-05-06 03:40 GMT

బంగారం ధరలు గత కొంతకాలంగా తగ్గుతున్నాయి. అయితే ఈ తగ్గుదల ఎన్నాళ్లు ఉంటుందన్నది చెప్పలేమంటున్నారు వ్యాపారులు. డిమాండ్ లేకపోయినప్పటికీ ధరలు పెరిగే అవకాశముంటుందని చెబుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి భారీగా బంగారం ధరలు పతనమయ్యాయి. అయితే కొనుగోలుదారులు మాత్రం మరింత ధరలు తగ్గుతాయేమోనని వెయిట్ చేస్తున్నారు. ధరలు బాగా తగ్గి అందుబాటులోకి వచ్చినప్పుడు కొనుగో్లు చేయవచ్చన్న భావనలో చాలా మంది ఉండటంతో అమ్మకాలు గణనీయంగా పెరగకపోయినా ధరలు మాత్రం త్వరలోనే పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు తాజాగా అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

ఎప్పటికీ తగ్గని డిమాండ్...
బంగారం, వెండి ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. వాటికి ఉన్న డిమాండ్ మాత్రం తగ్గదు. బంగారం కొనుగోలు చేసే వారు ప్రత్యేకంగా ఉంటారు. ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం వారికి అలవాటు. ఎందుకంటే బంగారం అంటే పిచ్చిమోజు. అలాగే కొందరు మాత్రం భవిష్యత్ కు బంగారం భరోసా ఇస్తుందని నమ్ముతారు. మరొకవైపు పెట్టుబడి పెట్టేవారు కూడా సురక్షితమైన పెట్టుబడి అని భావిస్తారు. బంగారం కొనుగోలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాదని అనుకుని వాటిని కొనుగోలు చేస్తారు. మరొక వైపు పెళ్లళ్ల సీజన్ కూడా నడుస్తుండటంతో కొందరు తమ అవసరం మేరకు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తుండటంతో ఇప్పుడిప్పుడే అమ్మకాలు ఊపందుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
స్వల్పంగా పెరిగి...
బంగారం ధరలు పెరగడమనేది ఇటీవల కాలంలో సర్వ సాధారణమయింది. అదే సయమంలో తగ్గడం కూడా భారీగా ఇటీవల కాలంలో జరగడంతో ఇంకా తగ్గుదల ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ జూన్ వరకూ ఉండటంతో తమకు ఢోకా లేదని వ్యాపారులు భరోసాగా ఉన్నారు. అయితే కొనుగోళ్లు ఎంత మేరకు జరుగుతాయన్నది చూడాలంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరగగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం వెడి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,760 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,740 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,07,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News