Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్పంగా పెరుగుదల కనిపించింది.

Update: 2025-02-26 03:16 GMT

బంగారం ధరలు ఎప్పటికప్పడు మారుతుంటాయి. ధరలు అదుపులో ఉండటం ఈ ఏడాది ప్రారంభం నుంచి సాధ్యం కావడం లేదు. బంగారం, వెండి ధరలకు కళ్లెం పడటంబ లేదు. ధరలు రోజురోజుకూ పైపైకి పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే పెరిగిన ధరలతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంతగా. పెళ్లిళ్ల సీజన్ లో కూడా కొనుగోళ్లు తగ్గాయంటే ధరలు ఏమేరకు పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. శుభకార్యాలకు కూడా బంగారానికి దూరంగా ఉండేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారంటే గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు. గత సీజన్ తో పోలిస్తే దాదాపు డెబ్భయి శాతం కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.

కొనుగోళ్లు తగ్గి...
శుభకార్యాలకు బంగారాన్ని కొనుగోలు చేయడం సెంటిమెంట్ గా భావిస్తారు. అలాంటిది ధరలు పెరుగుదలతో సెంటిమెంట్ ను పక్కన పెట్టి ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. అత్యవసరమైతే తప్ప అదీ తక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ధరలు చూసి ఇంత డబ్బులు పోసి కొనుగోలు చేయలేమని భావించి ముందుగానే మెంటల్ గా ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే బంగారం ధరలు దిగివస్తేనే కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు మరింతగా పెరుగుతాయని వారు చెబుతుండటం మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
స్వల్పంగా పెరిగి...
స్టేటస్ సింబల్ అయినప్పటికీ బంగారాన్ని కొనుగోలు చేయాలంటే డబ్బులుండాలి కదా? అన్నది ప్రధాన ప్రశ్న. పెట్టుబడులు పెట్టే వారు సయితం ఒకింత వెనుకంజ వేస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చులే అని భావించి ప్రస్తుతానికి కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,760 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 88,100 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,07,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News