Gold Price Today : బంగారం ఇక భారమే... కొనడం కష్టమే.. ఈ రేట్లు చూస్తే షాకే
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అస్సలు తగ్గడం లేదు. కొనుగోళ్లు తగ్గినా దాని మానాన అది పెరుగుతూనే పోతుంది. తనకు ఏమాత్రం సంబంధం లేదంటూ పెరిగిన ధరలతో కొండెక్కి కూర్చుంది. ఇప్పుడున్న బంగారం ధరలను చూసి కొనుగోలు చేసే వారు దాదాపు ఎవరూ ఉండకపోవచ్చు. ఎవరో అరకొర తప్ప మోజుతో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునేవారు మాత్రం అటు వైపు కూడా చూడరు. అలా ఉంది సీన్. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 88 వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్షా ఏడు వేల రూపాయలు పలుకుతుంది. ఇంత భారీ స్థాయిలో ధరలు పెరుగుతుండటం బహుశ గతంలో ఎన్నడూ చూడలేదని వ్యాపారులే చెబుతున్నారు.
మోజు ఉన్నప్పటికీ...
బంగారం అంటేనే మోజు ఎవరికి మాత్రం ఉండదు. స్టేటస్ సింబల్ గా గానే కాదు. తమ వద్ద ఉంటే బతుకు భద్రంగా ఉంటుందని భావించే వారు ఎంతో మంది ఉంటారు. అవసరమైన సమయంలో కష్టకాలంలో తమను ఆదుకునేది బంగారం మాత్రమేనని భావిస్తారు. ఎప్పుడైనా ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేది కూడా బంగారమే. బంగారాన్ని తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి ఏ జాతీయ బ్యాంకుల నుంచైనా రుణం తీసుకునే సదుపాయం ఉంది. తిరిగి చెల్లించి తమ వస్తువులను తాము సొంతం చేసుకునే వీలుండటం గోల్డ్ లో అడ్వాంటేజీ. అందుకే బంగారానికి క్రేజ్ ఎక్కువ. అయితే కొనుగోళ్లు మందగించడం గతంలో ఎప్పుడూ లేదని వ్యాపారులు కూడా అభిప్రాయపడుతున్నారు.
పెరగడమే తప్ప...
బంగారానికి డిమాండ్ ఎప్పుడూ తక్కువగా ఉండదు. అంతర్జాతీయలో జరుగుతున్న మార్పులు కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,360 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,660 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,07,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.