Gold Price Today : బంగారం ధరలు తగ్గుతాయని అనుకుంటున్నారా? ఈరోజు ధరలు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగ పెరిగాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందన్న మార్కెట్ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ధరలు తగ్గుతుండటంతో ఇంకా ధరలు తగ్గుతాయని వినియోగదారులు వెయిట్ చేస్తున్నారు. తగ్గినప్పుడు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నారు. అధిక ధరలు వెచ్చించి బంగారం కొనుగోలు చేయడం అనవసరమని ఆలోచించి కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కు తగ్గుతున్నారు. అయితే బంగారం ధరలు నిజంగా తగ్గుతాయా? బంగారం ధరలు పెరగడానికి గల కారణాలేంటి? సీజన్ తో సంబంధం లేకుండా బంగారం ధరలు పెరిగడానికి ఏఏ అంశాలు దోహదం చేస్తున్నాయన్నది అందరికీ తెలిసిందే.
తగ్గుతాయని...
బంగారం అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ మహిళలకు ముఖ్యంగా బంగారం వస్తువు కనిపించిందంటే పూనకాలు వస్తాయి. తమకు నచ్చిన ఆభరణం దొరికితే కొనుగోలు చేసేంత వరకూ ఎవరూ ఊరుకోరు. కానీ ఇప్పటికే బంగారం ధరలు లక్ష రూపాయలు దాటేశాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు కొంత తగ్గుతాయేమోనని కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇంకా తగ్గుతాయేమోనని ఆశతో చూస్తున్న వారికి ఆశాభంగం తప్పేట్లు లేదు. బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాకిచ్చాయి. అందులోనూ శ్రావణమాసం కావడంతో మరింత ధరలు పెరిగే అవకాశముంది.
భారీగా పెరిగి...
పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరుగా జరుగుతుండటంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ధరలు తగ్గే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగ పెరిగాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై 1,540 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,290 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,350 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధరల 1,13,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.