Gold Price Today : వరసగా షాకిస్తున్న గోల్డ్ ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయో తెలిస్తే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వ్పలంగా తగ్గాయి.
బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే బంగారం అంటేనే భారంగా మారిపోయింది. ప్రధానంగా మధ్యతరగతి వర్గాలకు ఒకరకంగా బంగారం దూరం అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంత ధరపోసి బంగారాన్ని కొనుగోలు చేయడం అంటే మాత్రం అది జరగని పని. కొనుగోలు శక్తి లేని వాళ్లు కూడా బంగారానికి బాగా దూరమయ్యారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే అరవై నుంచి డెబ్భయి శాతం పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
దక్షిణ భారత దేశంలో...
ప్రధానంగా దక్షిణ భారత దేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బంగారానికి ఉన్నంత క్రేజ్ మరి ఏ వస్తువుకు ఉండదు. చిన్న చిన్న మొత్తాలను పొదుపుగా చేసుకోవడం బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది వినియోగిస్తారు. మహిళలు ముఖ్యంగా చీరలు తర్వాత బంగారానికే ప్రాధాన్యత దక్షిణ భారత దేశంలో జరుగుతుంటుంది. అందుకే దక్షిణ భారత దేశంలో చిన్న స్థాయి పట్టణం నుంచి పెద్ద పెద్ద నగరాల వరకూ కార్పొరేట్ జ్యుయలరీ దుకాణాలు వెలిశాయి అంటే ఇదే కారణం. దక్షిణ భారతదేశంలో ఉన్నన్ని జ్యుయలరీ దుకాణాలు మరెక్కడా లేవు. ఎందుకంటే ఇక్కడే ఎక్కువగా కొనుగోళ్లు ఉంటాయి. కానీ గత ఐదు నెలల నుంచి అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
నేటి ధరలు ఇవీ
బంగారం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటేనే వాటిని కొనుగోలు చేస్తారు. శక్తికి మించి కొనుగోలు చేయడానికి ఎవరూ సాహసించరు. కనీసం పెట్టుబడిగా భావించే వారు సయితం బంగారం ధరలు చూసి కొంత వెనకడుగు వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వ్పలంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,900 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,080 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,10, 900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.