Gold Price Today : పరుగులు పెడుతున్న బంగారం ధరలు... ఇక ఆగేట్లు లేవుగా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి.

Update: 2025-02-15 03:13 GMT

బంగారం ధరలు పైపైకి పోతున్నాయి. వెండి ధరలు కూడా ఎగబాకుతున్నాయి. అసలు బంగారం ధరలు ఇంత స్థాయిలో పెరుగుతాయని మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేయలేదు. ఎందుకంటే వచ్చే ఏడాదికి కాని పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు బంగారం ధరలు పెరుగుతున్న తీరును చూస్తుంటే వచ్చే ఏడాది వరకూ ఆగేట్లు లేవని అనిపిస్తుంది. ఈ ఏడాది బంగారం ధర లక్ష దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది అరుదుగా జరిగింది. ఈ ఏడాది మొదటి తేదీ నుంచి బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తూనే ఉంది.

మాఘమాసం ఎఫెక్ట్...
సీజన్ నడుస్తుండటంతో ధరలు పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. రికార్డు స్థాయలో బంగారం ధరలు నమోదవుతుండటం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాలకు భిన్నంగా పెరుగుదల కనిపిస్తుండటంతో పెట్టుబడి పెట్టే వారు తప్ప అవసరం నిమిత్తం కొనుగోలు చేసే వారు మాత్రం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మాఘమాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుండటంతో పాటు ఈ సీజన్ మరో ఐదారు నెలలు నడుస్తుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలను వ్యాపారులు చేస్తున్నారు. సాధారణ, మధ్యతరగతి ప్రజలు బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడో దూరమయ్యారు.
ధరలు పెరగడంతో...
కేవలం ఒక వర్గం వారు మాత్రమే బంగారానికి ప్రస్తుతం చేరువగా ఉన్నారు. వారు కూడా అంత మొత్తం వెచ్చించి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడటంలేదు. పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత కొనుగోళ్లపై ధరల పెరుగుదల ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,910 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,170 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,08,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.



Tags:    

Similar News