Gold Rates Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు కూడా.. నేటి ధరలు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.
బంగారం ధరలకు బ్రేకులు పడటం లేదు. వరసగా పెరుగతూనే ఉన్నాయి. షాకుల మీద షాకులు కొనుగోలుదారులకు ఇస్తున్నాయి. పెరుగుతున్న బంగారం ధరలను చూస్తుంటే ఇక దానిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదేమోనని అనిపిస్తుంది. బంగారం అంటే నిజంగానే స్టేటస్ సింబల్ గా మారుతుంది. కోహినూర్ వజ్రం తరహాలో అరుదైన వస్తువుగా మారిపోయే అవకాశం ఉందన్నది వాస్తవం. ఎందుకంటే ధరలు అదుపులో లేకుండా కొందరికే కొనుగోలు సామర్థ్యం ఉన్నప్పుడు అది డైమండ్ ను మించి పోతుందని అంచనాలు అనుకోవచ్చు. అందుకే బంగారం అనేది అందరికీ అందుబాటులో ఉంటే కొనుగోళ్లు పెరుగుతాయి. అదే సమయంలో డిమాండ్ కూడా ఏర్పడుతుంది.
లక్ష దాటేసిన...
బంగారం ధరలు ఇప్పటికే లక్ష రూపాయలు దాటేసింది. వెండి ధరలు కూడా దాని కంటే ముందే పరుగులు పెడుతున్నాయి. భారతీయ సెంటిమెంట్ లో భాగమైన బంగారం, వెండి ధరలు ఇలా పెరుగుతుండటం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తుంది. బంగారం వైపు చూడాలంటనే భయమేస్తుంది. అదే సమయంలో ధరలు ఇంకా పెరుగుతాయన్న సంకేతాలు మరింతగా డీలా పడే చేస్తున్నాయి. బంగార ప్రియులంటే మహిళలే. వారే ఎక్కువగా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుంటారు. అలాంటిది మహిళలే బంగారం కొనుగోలు పట్ల అనాసక్తి కనపరుస్తున్నారంటే అంతకు మించిన ఇబ్బంది జ్యుయలరీ దుకాణాలకు ఏముంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
భారీగా పెరిగి...
దక్షిణ భారత దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే బంగారం ఈ ఏడాది కాలంలో దారుణంగా పడిపోయాయి. ప్రతి నెలా ధరలు పెరుగుతుండటంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 1,040 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర పై వెయ్యి రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,810 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,02,340 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,19, 100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.