Gold Price Today : లక్ష దాటేసిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంది. వెండి దరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే అమ్మకాలు చాలా వరకూ నిలిచిపోయాయి. ధరలు పెరుగదల ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకూ దాదాపు అరవై శాతం వరకూ అమ్మకాలు పడిపోయాయని జ్యుయలరీ దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు. రాను రాను మరింతగా అమ్మకాలు పడిపోతాయని అంటున్నారు. తాము వ్యాపారాలు చేయడం కూడా ఇక కష్టంగానే మారుతుందని, భవిష్యత్ లో బంగారం ధరలు మరింత పెరిగితే ఇంకా తగ్గుతాయని అంటున్నారు.
అమ్మకాలపై ప్రభావం...
ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ అయినా సూత్రాలు వంటి వాటినే కొనుగోలు చేస్తూ సరిపెట్టుకుంటున్నారని, అంతే తప్ప ఆభరణాల జోలికి మాత్రం పోవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. లక్ష రూపాయలు పెట్టినా సరైన ఆభరణం వచ్చే అవకాశం లేదు. చిన్న ఉంగరం వేలికి చేయించుకోవాలన్నా కనీసం డెబ్భయి నుంచి ఎనభై వేల రూపాయలు అవుతుందని, అంత అవసరాన్ని ఎవరూ తమకు అనుకూలంగాతీసుకోవడం లేదని అంటున్నారు. ఇంత ధరలు పెట్టి కొనుగోలు చేస్తే బంగారం ధర పతనమయితే తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని వ్యాపారులు ఆందోళనకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదని అంటున్నారు.
భారీగా పెరిగి...
లక్ష రూపాయలు దాటడంతో బంగారంపై పెట్టుబడి పెట్టే వారు సయితం ఎవరూ ముందుకు రావడం లేదు. పెట్టుబడి పెట్టినా ఇది రిస్క్ తో కూడుకున్నదన్న భావన వారిలో పెరిగింది. అందుకే పెట్టుబడి దారులు కూడా ముందుకు రాకపోవడంతో అమ్మకాలు నలభై నుంచి ముప్ఫయి శాతం వరకే జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటల వరకూ ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర పై 2,562 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,900 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,02,062 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,11,000 రూపాయలకు చేరుకుంది.