Gold Price Today : బంగారు కొనేవారికి షాక్.. పెరిగిన ధరలు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలు అంటేనే హెచ్చుతగ్గులుంటాయి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లిళ్ల సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో ధరలు మరంత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిన్నటి వరకూ ఆఫ్ సీజన్ అయినా ధరలు పెరుగుతూనే వచ్చాయి. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ధరలు పెరుగుతూ వినియోగదారులను ఇబ్బంది పెట్టాయి. ఆందోళనకు గురి చేశాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ వారం రోజుల్లో ప్రారంభమవుతున్న సమయంలో ధరలు ఇంకా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేయాలని భావించే వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో...
బంగారం అంటేనే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. గత పది రోజుల్లో రెండువేల వరకూ పది గ్రాముల పై పెరిగింది. కిలో వెండి ధరపై నాలుగు వేల రూపాయల వరకూ పెరిగింది. ఇక నేడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో ధరలు మరింతగా పరుగులు పెట్టే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బ్రేకుల్లేకుండా ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగ్గితే స్వల్పంగా తగ్గడం, పెరిగితే ధరలు భారీగా పెరగడం బంగారం, వెండి విషయాల్లో సాధారణమే అయినప్పటికీ రాను రాను బంగారం కొనుగోలు చేయాలంటే మరింత కష్టమవుతుందన్న సూచనలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి.
వెండి తగ్గి...
బంగారం ధరలు అమాంతంగా పెరిగి పోతుండటంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడుతుందన్న ఆందోళన వ్యాపారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్లిళ్లసీజన్ ప్రారంభమయితే కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,540 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 81,240 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 1,03,900 రూపాయలుగా నమోదయింది.