Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగివస్తున్నాయ్.. ధరలు ఎంతంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుతున్నాయి.

Update: 2025-07-10 02:41 GMT

బంగారం ధరలు తరచూ పెరుగుతూనే ఉంటాయి. బంగారం, వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది. అయితే గత కొంత కాలంగా ధరలు దిగి వస్తున్నప్పటికీ ఇప్పటికీ మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే స్థాయికి ధరలు రాకపోవడంతో అమ్మకాలు ఊపందుకోలేదు. మరొకవైపు ఆషాఢమాసం కావడంతో బంగారం, వెండి కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయనే చెప్పాలి. సెంటిమెంట్ ప్రకారం ఆషాఢమాసంలో బంగారాన్ని కొనుగోలు చేయరు. అయితే వచ్చే శ్రావణంలో ధరలు మరింత పెరుగుతాయని భావించిన కొందరు మాత్రం బంగారం కొనుగోలు వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఆశించినంత రీతిలో మాత్రం కొనుగోళ్లు ఇంకా మొదలు కాలేదు.

ఆల్ టైం రికార్డు కు చేరుకుని...
బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ధరలు పెరగడానికి, తగ్గడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ నెలలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ చెబుతున్నారు. కొనుగోలు చేయాలంటే ఇదే మంచి సమయమని కూడా కొందరు సూచిస్తున్నారు. ధరలు తగ్గుతాయని వెయిట్ చేయడం కన్నా కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
ధరలు తగ్గి...
బంగారాన్ని భద్రతగా భావించి అనేక మంది కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు పసిడి పట్ల ఆసక్తి చూపుతుంటే, పురుషులు మాత్రం భవిష్యత్ కు గ్యారంటీ అని భావించి కొనుగోలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయ ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు 92,010 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,360 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,10,780 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News