Gold Price Today : తీపికబురు.. బంగారం ధరలు భారీగా తగ్గినట్లే...కొనుగోలుకు రైట్ టైం

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Update: 2025-08-12 03:36 GMT

బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అనేక కారణాలతో ధరలు పెరుగుతూ ప్రతి రోజూ రెండు సార్లు వినియోగదారులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయాలంటేనే భయం వేస్తుంది. బంగారు ఆభరణం కొనుగోలు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అలాగే అప్పుడు చేయాల్సిందేనన్న సామెత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్నాళ్లుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇక తగ్గవేమోనన్న అభిప్రాయం అందరిలోనూ కలుగుతుంది. అందుకు ప్రధాన కారణం ఇటువంటి పరిస్థితుల్లో బంగారం మార్కెట్ మాత్రం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని వ్యాపారులు చెబుతున్నారు. బిజినెస్ నిపుణులు కూడా గతంలో ఎన్నడూ ఈ పరిస్థితులు చూడలేదని అంటున్నారు.

సీజన్ అయినా...
శ్రావణ మాసం కావడంతో పాటు మరో నాలుగు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరుగా జరుగుతాయి. లక్షల సంఖ్యలో జంటలు ఒకటిగా మారతాయి. ఇక గృహప్రవేశాలు, శంకుస్థాపనలకు మంచి సమయం కూడా. అందులోనూ శ్రావణ శుక్రవారాలు కూడా తోడయ్యాయి. ఇన్ని జరుగుతున్నా బంగారానికి పెరగాల్సిన డిమాండ్ మాత్రం పెరగడం లేదు. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా లక్ష రూపాయలు దాటేసిన పది గ్రాముల బంగారం గత కొద్ది రోజుల నుంచి దిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వెండి ధరలు కూడా కిలో లక్షా ఇరవై ఆరు వేల రూపాయల వరకూ నమోదయిదంటే ఏ రేంజ్ లో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.
భారీగా తగ్గి...
అంతర్జాతీయ మార్కెట్ లో అమెరికా డాలర్ బలపడటంతో పాటు పెట్టుబడి దారులు బంగారం పై కాకుండా ఇతర విషయాలపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతుండంతో కొంత ధరలు అదుపులోకి వస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 760 రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,470 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,02,270 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,26,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News