Gold Price Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు .. ఈరోజు ఎంతంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల కనిపించింది.

Update: 2025-08-02 01:38 GMT

ఏవస్తువుకైనా ధరలు పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అదే ధరలు తగ్గితే అమ్మకాలు పెరిగి వాటికి డిమాండ్ పెరుగుతుంది. బంగారం కూడా వాటికి అతీతం కాదు. గత కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. అయితే ఇంకా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు అందుబాటులోకి ధరలు రాలేదు కానీ చాలా వరకూ ధరలు కిందకు దిగి వచ్చాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో అనేక సార్లు పది గ్రాముల బంగారం ధరలు లక్ష రూపాయలకు చేరుకుని మళ్లీ దిగిరావడం చూశాం. ఇక ఆషాఢమాసంలో ధరలు విపరీతంగా పెరగడంతో శ్రావణ మాసంలో వీటి ధరలు ఇంకెంత పెరుగుతాయన్న ఆందోళన ప్రతిఒక్కరిలోనూ కనిపించింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ధరలు కొంత కొంతగా దిగి వస్తున్నాయి.

శ్రావణమాసమైనా...
శ్రావణ మాసంలో అత్యధికంగా బంగారం, వెండి ఆభరణాలను కొనుగోళ్లు చేస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో ధరలు మరింత భగ్గుమంటాయన్న అంచనాలు ప్రతి ఒక్కరూ వేశారు. కానీ శ్రావణ మాసం ఆరంభం నుంచే ప్రతి రోజూ ఎంతో కొంత బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అయితే బంగారం ధరలు తగ్గడానికి, పెరగడానికి డిమాండ్, కొనుగోళ్లు ఒక్కటే కారణం కాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో నెలకొన్న ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాద్యం, యుద్ధాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు వంటివి బంగారం ధరలు మరింత పెరుగుతాయని భావించారు.
భారీగా తగ్గి...
బంగారంపై పెట్టుబడి పెట్టే వారు సయితం చాలా వరకూ వెనక్కు తగ్గారు. వీటికి కారణం ధరలు తగ్గకపోవడమేనని చెప్పాలి. భవిష్యత్ లో బంగారం, వెండి ధరలు తగ్గవన్న గ్యారంటీ లేకపోవడంతో వారు కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 210 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై రెండు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం 91,490 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,22,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News