Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు...ఎంతంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా ఎక్కువ తగ్గుదల కనిపిస్తుంది

Update: 2025-07-25 03:35 GMT

భారత్ లో బంగారం ఎక్కువగా విక్రయాలు జరుగుతుంటాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల మేరకు బంగారం, వెండి ధరలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. బంగారాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. అలాగే స్టేటస్ సింబల్ గా కూడా చూస్తారు. బంగారాన్ని తమ ఇంటి వస్తువుగా అనుకుంటారు. అలాగే బంగారం అంటే భవిష్యత్ కు భద్రతగా కూడా అనుకుని మరీ కొనుగోలు చేస్తుంటారు. బంగారం కేవలం అలంకారంగా మాత్రమే కాదు.. కష్ట సమయంలో ఆదుకునే వస్తువుగా కూడా చూస్తారు. ఇలా అన్ని రకాలుగా బంగారం భవిష్యత్ లో చేదోడు వాదోడుగా ఉంటుంది. అందుకే బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా దక్షిణ భారత దేశంలో మరింత ఎక్కువగా కనిపిస్తాయి.

భవిష్యత్ కు భరోసా...
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం ధరలు పెరుగుతూనే వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఏడాదిలో బంగారం దాదాపు పది వేల రూపాయల వరకూ పది గ్రాముల పై పెరిగింది. ఇప్పటికే మూడు సార్లు లక్ష రూపాయలకు పది గ్రాముల బంగారం దాటేసింది. దీంతో బంగారం కొనుగోళ్లపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. బంగారాన్ని ఎక్కువగా చిన్న మొత్తంలోనైనా కొనుగోలు చేసేది మధ్యతరగతి ప్రజలు మాత్రమే. ఉద్యోగులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కానీ బంగారం ధరలు ఎక్కువగా కావడంతో ఈ రెండు వర్గాలు బంగారానికి దూరం కావడంతో అమ్మకాలు గణనీయంగా పడిపోయినట్లు జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతుంది.
భారీగా తగ్గి...
బంగారం అంటే ఒకప్పుడు ఒంటి మీద అలంకరించుకునే ఆభరణంగానే చూస్తారు. కానీ నేడు అపురూపమైన వస్తువుగా మారింది. కొందరికి మాత్రమే బంగారం తమ వస్తువుగా మారిపోయింది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా ఎక్కువ తగ్గుదల కనిపిస్తుంది. పది గ్రాముల బంగారం ధరపై 1,380 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై రెండు వేల రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిని బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,540 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,960 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,27,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News