Gold Price Today : పసిడి ప్రియులకు భారీ ఊరట.. బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి
గారం అంటేనే క్రేజ్. దానిని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి నగదుతో చిన్న బంగారు ఆభరణాన్ని అయినా కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. బంగారం అనేది సంపదగా భావిస్తారు. అది తమ వద్ద ఉంటే భవిష్యత్ కు భరోసాతో పాటు భద్రతకూడా ఉంటుందని నమ్ముతారు. కష్టకాలంలో బంగారం ఆదుకుంటుందని భావిస్తారు. గతంలో బంగారం అనేది స్టేటస్ సింబల్, సంస్కృతి సంప్రదాయాల్లో ఒకటి అయినప్పటికీ ధరలు పెరుగుతున్న క్రమంలో ఇది సురక్షితమైన పెట్టుబడిగా కూడా చూస్తున్నారు. అందుకే బంగారం ధరలు అంతగా పెరిగిపోయాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ కొనుగోలుదారులకు దూరం అయిందనే చెప్పాలి.
సీజన్ తో సంబంధం లేకుండా...
బంగారం, వెండి వస్తువులకు సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. గతంలో పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాల సందర్భంలోనే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు. రాను రాను అది చివరకు చిన్నపాటి ఫంక్షన్ కు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. బంగారం, వెండి బహుమతిగా ఇస్తే అంతకు మించి విలువైన బహుమతి మరేదీ ఉండదన్న భావనతో ఎక్కువ డిమాండ్ పెరిగింది. అయితే ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలయి కొన్ని నెలలు కావస్తున్నా కొనుగోళ్లు మాత్రం పెరగడం లేదు. దీంతో జ్యుయలరీ దుకాణాలు వినియోగదారులు లేక వెలవెల బోతున్నాయి. అదే సమయంలో ఇంకా ధరలు తగ్గుతాయమోనని పెట్టుబడి దారులు ఎదురు చూస్తున్నారు.
భారీగా తగ్గి...
బంగారం, వెండి వస్తువుల ధరలు అందరికీ అందుబాటులో ఉంటేనే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. అదే సమయంలో అనేక పరిణామాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులను ఎవరూ శాసించలేని పరిస్థితి. పెరుగుదలకు అనేక కారణాలుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,190 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,480 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,06,900 రూపాయలకు చేరుకుంది.