Gold Price Today : హ్యాపీ న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపిస్తుంది.
బంగారం ధరలు పెరిగితే భారీగా, తగ్గితే తక్కువగా తగ్గుతుంటాయి. పది గ్రాములపై పది రూపాయలు తగ్గినా అది తగ్గుదల అని వినియోగదారులు సంబరపడిపోతుంటారు. గత కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి నిన్నటి వరకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ధరలు పెరుగుతూనే ఉండటంతో కొనుగోళ్లపై దాని ప్రభావం పడుతుంది. కొనుగోళ్లు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనుగోలు చేయడానికి వినియోగదారులు జంకుతున్నారు. పది గ్రాముల బంగారం ధర 88,000 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర లక్షా ఐదు వేల రూపాయలు పలుకుతుంది.
సీజన్ లో అయినా...
పెళ్లిళ్ల సీజన్ లో సహజంగా కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ధరల పెరుగుదల ప్రభావంతో సీజన్ అయినప్పటికీ బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేవారు లేరు. జ్యుయలరీ దుకాణాలన్నీ వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు అవసరమైన బంగారాన్ని కొనుగోలు చేయడానికి కూడా ఒకింత వెనుకంజ వేస్తున్నారు. పెళ్లిళ్లలో బంగారం పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. పుట్టిన రోజుల లాంటి చిన్న వేడుకలకు కూడా గతంలో బంగారం, వెండి కొనుగోలు చేసే వారు. కానీ ఇప్పుడు పెళ్లిళ్లకే బంగారాన్ని తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. అవసరమైనంత మేరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
భారీగా తగ్గి...
దీంతో జ్యుయలరీ దుకాణాల్లో ఉన్న స్టాక్ అలాగే ఉండిపోయింది. పెద్ద పెద్ద బంగారు నగలవైపు అస్సలు కొనుగోలు దారులు చూడటం లేదు. చిన్న చిన్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపిస్తుంది. పది గ్రాముల బంగరాం ధరపై 280 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై రెండు రోజుల్లో మూడు వేల రూపాయల వరకూ తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,490 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,810 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,05,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.