Gold Price Today : పసిడి ప్రియులకు తీపి కబురు.. బంగారం ధరలు ఎంత తగ్గాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ప్రతి రోజూ పెరుగుతూ ఉంటాయి. నిత్యం వాటి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఈ ఏడాదిలో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. బంగారం పెరుగుదల చూస్తే పది గ్రాముల బంగారం ధర ఈ ఏడాది పది గ్రాములు లక్ష రూపాయలకు చేరుకుంటుందని అంచనాలు కూడా వినపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బంగారం ధరలు పరుగు అందుకున్నాయి. అప్పటి నుంచి ధరలు తగ్గడం లేదు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే రీతిలో పరుగులు పెడుతున్నాయి. వెండి వస్తువులను కొనుగోలు చేయాలని భావించినా ధరలను చూసి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.
మార్పులు జరగడానికి...
అయితే బంగారం, వెండి ధరల్లో మార్పులు జరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయంగా ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ద్రవ్యోల్బణం, యుద్ధాలు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడంతో వారు కూడా తమలో ఉన్న కోర్కెలను చంపుకుంటున్నారు. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 88 వేలకు చేరువలో ఉంది. అదే సమయంలో కిలో వెండి ధర 1,08 లక్షల రూపాయలుగా నమోదయిందంటే ఏ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ధరలు మరింత పెరుగుతాయని అందరూ భావించారు. అందరూ అనుకున్నట్లుగానే ధరలు సామాన్యులు,మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయిం. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,390 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,700 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,08,000 రూపాయలకు చేరుకుంది.