Gold Price Today : బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పనిచేయండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది

Update: 2025-06-18 04:26 GMT

బంగారం ధరలు పెరుగుతూ వినియోగదారులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఇంతగా పెరగలేదని ఇటు వినియోగదారులు అటు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడమే బంగారానికి తెలుసు. తగ్గడం అనేది బంగారం విషయంలో అరుదుగా జరుగుతుంటుంది. వారంలో ఆరు రోజుల పాటు బంగారం ధరలు పెరుగుతూ వెళుతుంటే ఒక్కరోజు మాత్రం స్వల్పంగా తగ్గి ఊరించేందుకు సిద్ధమవుతుంది. అయితే బంగారం ధరలు ఇంకా అందుబాటులోకి రాలేదని వ్యాపారులు చెబుతున్నారు. మధ్య, సామాన్యులకు అందుబాటులో ధరలు ఉంటేనే కొనుగోళ్లు ఊపందుకుంటాయని చెబుతున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో ఆ ప్రభావం అమ్మకాలపై పడుతుంది.

లక్ష కు తగ్గకుండా...
మే నెలలో లక్ష రూపాయలకు టచ్ చేసిన బంగారం ధరలు తర్వాత క్రమంగా కొంత తగ్గి లక్షకు దిగువకు చేరాయి. కానీ గత నాలుగు రోజుల నుంచి లక్షరూపాయలకు పైగానే ఉండటంతో ధరలు మళ్లీ పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, దిగుమతులు నిలిచిపోవడం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు ఈ ఏడాది ప్రారంభం నుంచే పెరుగుతూ ఆశలపై నీళ్లు చల్లాయని వినియోగదారులు వాపోతున్నారు.
నేటి ధరలు...
బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఆషామాషీ కాదు. ఎందుకంటే అంత ధరలు వెచ్చించి కొనుగోలు చేసిన బంగారం ధరలు మళ్లీ తగ్గవన్న గ్యారంటీ లేదు. పెట్టుబడి పెట్టే వారు సయితం వెనుకంజ వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,360 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,20,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News