Gold Price Today: గుడ్ న్యూస్... బంగారం ధరలు తగ్గుతున్నాయి.. మహిళలకు తీపి కబురు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి

Update: 2025-06-26 04:21 GMT

బంగారం ధరలు ఈ ఏడాది ఆరంభం నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ధరలు తగ్గినా తక్కువ మొత్తంలోనే కావడంతో ప్రజలకు బంగారం ధరలు అందుబాటులోకి రాలేదు. మే నెలలో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది. తర్వాత క్రమంగా తగ్గుతూ దిగువకుచేరినా ఈనెల మూడో వారలో మళ్లీ లక్ష రూపాయలను టచ్ చేసింది. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న బంగారం, వెండి ధరలను చూసి వినియోగదారులు టచ్ చేయడానికే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ధరలు ఇంకా పెరుగుతాయన్న మార్కెట్ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోళ్లు దేశ వ్యాప్తంగా భారీగా తగ్గాయి.

ఆషాఢమాసం కావడంతో...
ఏ వస్తువయినా తమకు అందుబాటులో ఉంటేనే కొనుగోలు చేస్తారు. తమ శక్తికి మించి ధర ఉంటే మాత్రం దాని వైపు కూడా చూడరు. ఎంత బలహీనత ఉన్నా ఆ వస్తువును దూరం పెడతారు. బంగారం, వెండి విషయంలో ఇదే జరిగింది. జ్యుయలరీ దుకాణాలన్నీ కొనుగోలుదారులు లేక బోసి పోయి కనిపిస్తున్నాయి. పెళ్లిళ్లు జరిగే పీక్ సీజన్ లోనూ పెద్దగా అమ్మకాలు జరగకపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అయితే ఇన్నాళ్లు జరిగిన యుద్ధాలు ముగిసి శాంతి వైపు పయనిస్తుండటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో ధరలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తగ్గిన ధరలు...
బంగారం అంటే ఒక సెంటిమెంట్. మహిళలు ముఖ్యంగా ఇష్టపడే బంగారు ఆభరణాలు ఆషాఢమాసంలో పెద్దగా కొనుగోలు చేయరు. నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో బంగారం కొనుగోళ్లు మరింత తగ్గుతాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 270 రూపాయలు తగ్గగా, కిలో వెండి పై వెయ్యి రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,690 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,940 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,17,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News