Gold Price Today : బంగారం ధర తగ్గిందని తొందరపడకుమా... అందుబాటులోకి రాలేదట
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. కొంచెం ధరలు తగ్గినా చాలు ఆనదం చెప్పలేం. ఎందుకంటే ధరలు తగ్గడం కావాలి. ఎంత తగ్గిందని కాదు. అదే మహిళల బలహీనత. బంగారం ధర కొంచెం తగ్గితే చాలు ఎగబడి కొనుగోలు చేయాలని మగువలు భావిస్తారు. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటేశాయి. కిలో వెండి ధరలు కూడా మండి పోతున్నాయి. భగ్గుమన్న ధరలను చూసి షాకవుతున్న ప్రజలకు అప్పుడప్పుడు ఊరట కలిగించేలా ధరలు తగ్గుతుంటాయి. అయితే ఈ ధరలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది బంగారం కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఆల్ టైం హైకి చేరుకున్న బంగారం, వెండి ధరలు ఇంకా ఎంత పెరుగుతాయన్నది చెప్పలేని పరిస్థితి.
సీజన్ లేకపోవడంతో...
పెళ్లిళ్ల సీజన్ కూడా దాదాపుగా ముగియడంతో పాటు శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలు కూడా లేకపోవడంతో మరికొద్ది రోజులకు బంగారానికి గిరాకీ ఉండదు. అయినా సరే బంగారం ధరలు మాత్రం ప్రియంగానే ఉన్నాయి. డిమాండ్ తగ్గితే సహజంగా ధరలు తగ్గాలి. కానీ అమ్మకాలు తగ్గిన రేంజ్ లో మాత్రం ధరలు బంగారం విషయంలో తగ్గకపోవడం వినియోగదారులను ఉసూరుమనిపిస్తుంది. భారత్ లో ఎక్కువగా బంగారు ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేస్తారు. గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడం అనేది జరగదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి గోల్డ్ బిస్కట్లను కొనుగోలు చేసే వారు కూడా చాలా అరుదుగా ఉంటారని వ్యాపారులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
భారత్ లో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. అలాంటిది ఈ ఏడాది నుంచి పెరుగుతున్న ధరలను చూసి కొనుగోలు దారులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడి కింద చూసే వారు కూడా అటు వైపు చూడటం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై ఆరువందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,090 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,470 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,19,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.