Gold Price Today : బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. వాటికి అడ్డూ అదుపూ ఉండదు. మామూలు ధరలు మండిపోతున్న సమయంలో బంగారం, వెండి ధరలు పెరగకుండా ఉన్నాయంటే ఎలా నమ్మాలి? అతి విలువైన అరుదైన బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసేందుకు జనం పోటీ పడుతుంటారు. తమ ఆర్థిక స్థోమతకు తగినట్లుగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ధరలు పెరిగినప్పుడు కొంత నిరాశ చెండం కూడా అంతే సహజం. ఎందుకంటే ఎక్కువ ధరలు ఉన్నప్పుడు కొనుగోలు చేయడం కంటే ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని ఎక్కువ మంది అనుకుంటారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. అందుకే బంగారం ధరపెరిగినప్పుడల్లా విక్రయాలపై ప్రభావం పడుతుంది.
సీజన్ అయినా...
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తుంది. అయినా వ్యాపారులు ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడానికి కారణం ధరలు అందుబాటులో లేకపోవడమేనని అంటారు. ఎందుకంటే లక్ష రూపాయలకు చేరువలో ఉన్న బంగారాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం అవసరమా? అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అందుకే అమ్మకాలు గత రెండు నెలల నుంచి గణనీయంగా తగ్గిపోయాయి. సీజన్ అయినప్పటికీ, చివరకు అక్షర తృతీయ అయినా పెద్దగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదంటే ఎంతగా బంగారం అంటే మొహం మొత్తిందని వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే ధరలు దిగి వచ్చినప్పుడు మాత్రం కొనుగోళ్లను ఆపలేరు.
స్వల్పంగా తగ్గడంతో...
పెరుగుతున్న ధరలకు తోడు జీఎస్టీ తో పాటు వివిధ రకాల పన్నులు, జ్యుయలరీ దుకాణాలు వేసే తరుగు లాంటి వాటితో ధరలు మరింత ఎక్కువవుతున్నాయి.గ్రాము బంగారాన్ని కొనుగోలు చేయాలన్నా నేడు గగనంగా మారింది. అందుకే బంగారం విషయంలో చాలా మంది ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,140 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,340 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,10,900 రూపాయలుగా నమోదయింది.