Gold Price Today : ఆలసించిన ఆశాభంగం.. నేడే పసిడి కొనేయండిక...తగ్గిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్పతగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ధరలు ఎప్పుడూ దిగిరావు. బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. అంతర్జాతీయంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే బంగారం, వెండి ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు జరగడానికి అంతర్జాతీయంగా జరిగే పరిణామాలతో పాటు ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ట్రంప్ నిర్ణయాలు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటివి కారణాలంటూ అనేక విశ్లేషణలు మనం రోజూ వింటూనే ఉంటాం. ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు కూడా బంగారం కొనుగోలు చేసే విషయంలో ఆలోచనలో పడ్డారన్నది కూడా అంతే నిజం.
పెరుగుదలను...
ధరలు పెరుగుదలను ఎవరూ ఆపలేరు. వివిధ దేశాల నుంచి దిగుమతి కావాల్సిన బంగారం నిల్వలు రాకపోవడంతో పాటు ఉన్న నిల్వలు అయిపోవడంతో కూడా డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయంటున్నారు. అదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతున్నప్పటికీ జ్యుయలరీ దుకాణాలు ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదని వాపోతున్నారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలంటే హుషారుగా మహిళలు ముందుంటారు. కానీ ధరలను చూసి మహిళలు కూడా వెనక్కు తగ్గుతున్నారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలకు అవసరమైన బంగారం ధరల విషయంలో కూడా కొంత తగ్గి అవసరం కంటే తక్కువగానే కొనుగోలు చేస్తున్నారంటూ వ్యాపారులు చెబుతున్నారు.
కొద్దిగా తగ్గి...
బంగారం అంటే స్టేటస్ సింబల్ గా భావిస్తారు. అదే సమయంలో పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేసే వారు కూడా ధరలు తగ్గే వరకూ కొంత వెయిట్ చేయాలని చూస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్పతగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,090 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,550 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,11,800 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.