Gold Price Today : బంగారం కొనుగోళ్లు ఈ స్థాయిలో పడిపోయాయంటే.. అదే కారణమా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది.

Update: 2025-03-03 03:24 GMT

బంగారం ధరలు ప్రతి రోజూ వినియోగదారులకు చుక్కలు చూపుతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో బంగారం చేదుగా మారింది. బంగారం పై మక్కువ ఉన్నా ధరలను చూసి కొనుగోలుదారులు ఒకింత వెనకడుగు వేస్తున్నారు. ఎంతగా అంటే సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ లో అమ్ముడు పోవాల్సిన దాని కంటే గణనీయంగా కొనుగోళ్లు పడిపోయాయి. గత సీజన్ తో పోలిస్తే దాదాపు 70 శాతం కొనుగోళ్లు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇంతగా ఎప్పుడూ వ్యాపారాలు తక్కువగా జరగలేదని, 2025 ప్రారంభం నాటి నుంచి కొనుగోళ్లు తగ్గడంతో తాము దిగుమతి తయారు చేసుకోవాల్సిన బంగారాన్ని కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.

ఆఫర్లు ఇచ్చినా...
అదే సమయంలో కొత్త కొత్త డిజైన్ల ఆభరణాలను కూడా తయారు చేయించడం కార్పొరేట్ సంస్థలు నిలిపేశాయి. దీనికి తోడు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తరుగులో కొంత శాతం తగ్గింపు ఇస్తున్నామని ప్రకటించుకుంటున్నాయి. అంతే కాదు తమ వద్ద నిల్వ ఉన్న బంగారం ధరలపై పది గ్రాముల కు వెయ్యి రూపాయలకు తగ్గించినా ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదంటున్నారు. అందుకే పెళ్లిళ్ల సీజన్ కోసం తెప్పించిన స్టాక్ అలాగే నిలిచిపోయిందంటున్నారు. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 86 వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్షా నాలుగువేల రూపాయలుగా నమోదయింది.
ధరలు స్వల్పంగా తగ్గినా..
బంగారం అంటే అందరికీ ఇష్టమే. కానీ వాటి ధరలను చూసి కొనుగోలు చేయడం అసాధ్యమని భావించి జ్యుయలరీ దుకాణాల వైపు చూసేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు బంగారం, వెండి ధరలు ఇలా నమోదయ్యాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,390 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,610 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,04,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News