Gold Rates Today : ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్న బంగారం ధరలు.. వెండి ఇక కొనలేమేమో?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Update: 2025-08-10 03:09 GMT

బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. డిమాండ్ తో సంబంధం లేకుండా, సీజన్ తో నిమిత్తం లేకుండా ధరలు పెరగడం ఒక బంగారానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు నిత్యం పెరుగుతున్నాయి. దీంతో ధరల పెరుగుదల ప్రభావం కొనుగోళ్లపై పడింది. అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. భారీగా ధరలు పెరగడంతో కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తున్నప్పటికీ బంగారం విక్రయాలు ఊపందుకోవడం లేదని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం లబోదిబోమంటుంది. ఈ ఏడాదిలో అసలు బేరాల్లేవని ఆవేదన చెందుతున్నారు.

అందుబాటులో ఉంటేనే...
బంగారం ధరలు అందుబాటులో ఉంటేనే ఎవరైనా కొనుగోలు చేస్తారు. శక్తికి మించి బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ఎవరూ ఉత్సాహం చూపరు. అందులోనూ మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం విషయంలో ధరలు అమాతం పెరగడంతో వారు కూడా విముఖత చూపుతున్నారు. ఇప్పటికే బంగారం ధర ఆల్ టైంరికార్డును దాటేసింది. లక్ష రూపాయలకు పైగానే కొనసాగుతుండటంతో ఎవరూ కొనుగోలు చేయడానికి ఉత్సుకత చూపడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరలు ప్రతి రోజూ పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నేటి ధరలు ఇలా...
మరొకవైపు పెట్టుబడి గా చూసేవారు సయితం వెనుకంజ వేస్తున్నారు. ఇంతగా పెరిగిన బంగారం ధరలు తిరిగి తగ్గుతాయేమోనన్న ఆందోళనతో పెట్టుబడి పెట్టే వారు సయితం ప్రత్యామ్నాయ ఆస్తులపై తమ పెట్టుబడులు పెడుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,03,040 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 94,450 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 1, 27, 000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చు.



Tags:    

Similar News