Gold Price Today : గోల్డ్ కొనుగోలు చేయడం కంటే వేరే వాటిపై పెట్టుబడి పెట్టడం మంచిదా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది

Update: 2025-08-04 03:26 GMT

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది. శ్రావణమాసం ప్రారంభం కావడంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలు కావడంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. దీంతో బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటి వినియోగదారులకు షాక్ ఇస్తుంది. బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులుంటాయి. అనేక కారణాలతో నిత్యం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఉదయం ఉన్న ధరలు మధ్యాహ్నానికి మారవు. ఉదయం చూసి కొనుగోలు చేద్దామని జ్యుయలరీ దుకాణానికి వెళితే బంగారం ధరలు పెరిగి కొనుగోలు దారులకు షాక్ లు ఇస్తుంటాయి. అదే బంగారం స్పెషాలిటీ.

అనేక కారణాలు...
ధరల పెరుగుదలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు డిమాండ్ పెరగడంతో పాటు మరొక వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన సుంకాల ప్రభావం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, వివిధ దేశాల మధ్య కుదుతున్న వాణిజ్య ఒప్పందాలు, బంగారం దిగుమతులు క్షీణించడం వంటివి బంగారం ధరల్లో మార్పులు, చేర్పులకు కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి బంగారం ధరలు పెరిగితే తర్వాత తగ్గుతాయని భావించడం భ్రమే అవుతుందని బంగారం గురించి తెలిసిన వారు ఎవరైనా చెబుతారు.
స్వల్పంగా తగ్గినా...
పెట్టుబడులు పెట్టే వారు కూడా బంగారంపై నగదును పెట్టడానికి భయపడిపోతున్నారు. దీంతో పెట్టుబడి పెట్టాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. సురక్షితమైన వాటిని ఎంచుకుంటున్నారు. అందుకే బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలని భావించే వారు మాత్రం కాస్తంత వెనకడుగు వేశారనే అనుకోవాలి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు కనిపించే అవకాశముంది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,890 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,340 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1, 22, 900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News