Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయ్... ధరలు నేడు ఎంతంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది.

Update: 2025-08-01 03:07 GMT

బంగారం ధరలు పైపైకి పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతున్నాయి. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం ధరలు పెరుగుతుంటం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభమయిన బంగారం ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ఆషాఢమాసంలో బంగారం విక్రయాలు జరగకపోయినా ధరలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే లక్ష రూపాయలకు పది గ్రాముల బంగారం ధర చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇక తాజాగా శ్రావణ మాసం కావడంతో బంగారం తో పాటు వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెరుగుతూనే...
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన సుంకాల ప్రభావం కూడా బంగారం, వెండి ధరలపై పడే అవకాశముందని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు మరో నాలుగు నెలల పాటు అధికంగా జరుగుతుండటం, తెలుగు రాష్ట్రాల్లోనే లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు ఈ నాలుగు నెలల్లో జరుగుతుండటంతో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అందుకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరి ధరలు పెరిగినంత మాత్రాన కొనుగోలు చేయకుండా ఉండలేరు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగం కావడంతో బంగారం, వెండి వస్తువులను శుభకార్యాల సందర్భంగా ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
నేటి ధరలు...
పసిడికి ఎప్పుడూ క్రేజ్ తగ్గదు. స్టేటస్ సింబల్ గా చూడటంతో పాటు ఆభరణాలను మాత్రమే కాకుండా బంగారం బిస్కెట్లను కూడా పెట్టుబడిగా చూసే వారు ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. పుత్తడి పై పెట్టుబడి సురక్షితమని నమ్మి ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1.00,20 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,24,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Tags:    

Similar News