Gold Price Today : గుడ్ న్యూస్... నేడు కూడా దిగివచ్చిన బంగారం ధరలు ..ఎంతంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2025-07-30 03:10 GMT

బంగారం అంటే అమితంగా ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. అందులో బంగారాన్ని సొంతం చేసుకోవడానికి మక్కువ చూపుతుంటారు. బంగారం అనేది ఒక వస్తువుగా చూడరు. డబ్బులు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా దానిని సెంటిమెంట్ గానే భావిస్తారు. మెడలో ఆభరణాలుగా మాత్రమే కాదు... తమకు భవిష్యత్ లో భద్రత ఉంటుందని భావిస్తారు. అందుకే బంగారానికి సీజన్ తో సంబంధం లేకుండా డిమాండ్ ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. దీంతో ధరలు చూసి వీటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనుకంజ వేస్తున్నారు. అంత ధరలు ఉన్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడం ఆర్థికంగా మంచిది కాదని భావించి వెనక్కు తగ్గుతున్నారు.

సీజన్ అయినప్పటికీ...
ఆషాఢమాసంలోనూ బంగారం ధరలు పెరిగాయి. సహజంగా ఆషాఢమాసంలో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయరు. అలాంటిది ఈ మాసంలోనే పది గ్రాముల బంగారం ధరలు లక్ష రూపాయలు దాటేశాయి. కానీ శ్రావణమాసంలో మాత్రం క్రమంగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. నిజానికి ఈ మాసంలోనే బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. పెళ్లిళ్లు, వివాహాది కార్యక్రమాలు ఎక్కువగా ఉండటంతో బంగారం, వెండి ఆభరణాలకు మరో నాలుగు నెలల పాటు డిమాండ్ ఉంటుంటి. అందుకే జ్యుయలరీ దుకాణాలు కూడా నాలుగు నెలల పాటు మంచి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అదే సమయంలో కొనుగోళ్లు కూడా పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
స్వల్పంగా తగ్గి...
ఎక్కువగా దక్షిణ భారత దేశంలోనే బంగారం విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు అధికం కావడంతో ఈ ప్రాంతంలో జరిగిన బిజినెస్ మరెక్కడా జరగదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరుగంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,490 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,800 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,25,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News