Gold Price Today : గుడ్ న్యూస్ బంగారం ధరలు దిగివస్తున్నాయి... ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఇటీవల కాస్త దిగి వస్తున్నాయి. శ్రావణ మాసం ప్రారంభం నుంచి ధరలు తగ్గుతుండటం శుభపరిణామమేనని అంటున్నారు. సహజంగా డిమాండ్ ఎక్కువగా ఉండే సీజన్ లో బంగారం ధరలు ఎక్కువవుతాయి. పెరుగుతాయి. కానీ అదేమి విచిత్రమో కాని సీజన్ కాని ఆషాఢమాసం అంతా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కానీ పెళ్లిళ్లు, శుభకార్యాలున్న శ్రావణ మాసంలో మాత్రం ధరలు దిగి వస్తున్నాయి. వివాహాది శుభకార్యాలకు ఎక్కువగా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో ధరలు తగ్గుతుండటం మాత్రం కొంత ఆశాజనకమే అయినప్పటికీ ఇంకా ధరలు అందుబాటులోకి రాలేదంటున్నారు.
తగ్గడానికి కారణం...
ధరలు క్రమంగా తగ్గడానికి డాలర్ బలపడటేమేనని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని సూచిస్తున్నారు. వచ్చే కాలంలో ధరలు పెరగవని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేమని చెబుతున్నారు. అందుకే ధరలు తగ్గుతున్నప్పుడే కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. ఎటూ పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారాన్ని, వెండిని కొనుగోలు చేస్తుంటారు. దీనికి తోడు పెట్టుబడి పెట్టేవారు సయితం కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేయడానికి శ్రావణ మాసం మంచి సమయమని సూచిస్తున్నారు. జ్యుయలరీ దుకాణాలు కూడా ఇప్పుడిప్పుడే కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి.
స్వల్పంగా తగ్గి...
బంగారం ఎప్పుడూ సురక్షితమే. బంగారం పై పెట్టుబడి పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో నష్టం అనేది రాదు. కొద్దో గొప్పో లాభం వస్తుంది కానీ నష్టపోయేదేమీ ఉండదని బిజినెస్ నిపుణులు కూడా చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 91,159 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,25,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.