Gold Prices Today: బంగారం కొనడం ఇక ఆషామాషీ కాదట.. దరిదాపుల్లో కూడా ధరలు ఉండవట

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది.

Update: 2025-06-17 03:57 GMT

దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వినియోగదారులకు అందని విధంగా ధరలు చేరుకుంటున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం లక్ష రూపాయలు దాటేసింది. కిలో వెండి ధర అయితే విపరీతంగా పెరుగుతుంది. గత కొన్నాళ్ల నుంచి ధరలు పెరుగుతూనే ఉండటంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురి అవుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయడం ఇక భవిష్యత్ లో కష్టమవుతుందని నమ్ముతున్నారు. పెరిగిన బంగారం ధరలకు అనుగుణంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోవడం కూడా వారి ఆందోళనకు కారణం. ఒకవైపు నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడంతో పాటు జీవనవ్యయం కూడా భారీగా పెరగడంతో బంగారాన్ని కొనుగోలు చేసే ఆలోచనను పక్కన పెట్టేశారు.

కొనుగోలు ఆలోచనను...
ముందు తిండి, బట్ట, నివాసం. ఈ మూడు ఉంటే చాలు. తర్వాత అదనపు హంగులు. అలాంటి హంగుల్లో ఒకటి బంగారం. అంతా బాగుంటేనే బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అంతే తప్పించి ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎవరూ బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని ఇష్టపడరు. అందులోనూ అంత ధర వెచ్చించి కొనుగోలు చేయడం ఆషామాషీ కాదన్నది అర్థమయి గోల్డ్ పర్ఛేజ్ ఆలోచనను విరమించుకున్నట్లే కనపడుతుంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా పడిపోయిన అమ్మకాలను చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. బంగారం, వెండి ధరలు ఒక్కసారి పెరిగాయంటే ఇక దరిదాపుల్లోకి కూడా రావన్నది అందరికీ తెలిసిన సత్యమే. అందుకే బంగారం ఇక కొందరి వస్తువుగానే మారనుంది.
కొద్దిగా తగ్గినా...
భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యతను కూడా ధరలను చూసి పక్కన పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి. బంగారం కొనుగోలు చేస్తాం బతికేదెలా అని ప్రశ్నించుకునే వారు అధికంగా ఉన్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 160 రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,040 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,500 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,19,800 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News