Gold Prcie Today : తగ్గిందని సంతోషించాలా? బంగారం ధరలు దిగి వచ్చాయని కొనుగోలు చేయాలా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. 2025 బంగారం ప్రియులకు కలసి రాలేదు. బంగారాన్ని కొనుగోలు చేయడం ఈ ఏడాది గగనంగా మారింది. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కొనుగోలు చేయడానికి కూడా భయపడి పోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ ఏ ఏడాది ఇటువంటి పరిస్థితులు లేవు. బంగారం ధరలు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ, కొంచెం కొంచెం పెరుగుతూ వస్తున్నాయి. దాంతో పాటు ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుండటంతో అప్పుడు భారం అనిపించలేదు. కానీ ఈ ఏడాది మాత్రం ధరలు విపరీతంగా అంచనాలకు మించి పెరగడంతో తమ శక్తికి మించిన పనిగా బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని భావిస్తున్నారు.
ఆల్ టైం హైకి చేరుకోవడంతో...
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ గరిష్టంగా నమోదవుతుండటం చూసి ఈ ధరలు ఎంత వరకూ వెళతాయన్నది మార్కెట్ నిపుణులకు కూడా అంతు చిక్కడం లేదు. ధరలు పెరిగినప్పుడు భారీగా పెరగడంతో పాటు తగ్గినప్పుడు స్వల్పంగా తగ్గడం మామూలే అయినా.. వేలల్లో ఒకరోజులో పది గ్రాములపై పెరగడంతో గ్రాము బంగారం కొనుగోలు చేయడం కూడా కష్టంగా మారింది. అందుకే బంగారం వైపు చూడటం మానేశారు. బంగారం స్థానంలో ప్రత్యామ్నాయాన్ని పెట్టుబడి దారులు కూడా ఎంచుకుంటున్నారు. పెట్టుబడి పెట్టే వారు కూడా ప్రస్తుతం ధరలు చూసి కొనుగోలు చేయడం సాహసంతో కూడిన పనిగా భావిస్తున్నారు. సురక్షితం కాదని నమ్ముతున్నారు.
స్వల్పంగా తగ్గి...
దక్షిణ భారత దేశంలో ఎక్కువగా అమ్మకాలు జరిగే బంగారం, వెండి వస్తువుల విషయంలో గత నెలల నుంచి మందగమనం సాగుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు నిలిచిపోయాయంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,220 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,670 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1, 19, 900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.