Gold Price Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. గోల్డ్ రేట్స్ నేడు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఒకరోజు పెరిగితే మరొకరోజు స్వల్పంగా తగ్గుతున్నాయి. బంగారం, వెండి ధరలకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. కానీ పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ బంగారం, వెండి ధరలకు అంతగా డిమాండ్ లేకపోవడానికి ప్రధాన కారణం ధరలు విపరీతంగా పెరిగిపోవడమే. లక్ష రూపాయలకు పది గ్రాముల బంగారం చేరుకునే సమయంలో దానిని కొనుగోలు చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకన్న ధోరణి ఎక్కువ మందిలో కనపడుతుంది. బంగారం కొని దాచుకోవాలన్నా భయమేస్తుంది. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఎవరికీ అందకుండా వెళ్లిపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తాయి.
ఈ ఏడాది మొదలు నుంచే...
ఈ ఏడాది ప్రారంభం మొదటి నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. మధ్య మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చి తగ్గినట్లు కనిపించినా కానీ ఆశించినంత మేరలో బంగారం, వెండి ధరలు తగ్గలేదనే వినియోగదారులు భావిస్తున్నారు. అందుకే ఇంకా జ్యుయలరీ దుకాణాల్లోకి కాలు పెట్టడానికి కూడా సాహసించడానికి వెనుకాడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ లో అరకొర విక్రయాలు తప్ప సీజన్ లో ఉండాల్సిన అమ్మకాలు లేవని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గత సీజన్ తో పోలిస్తే బంగారం, వెండి అమ్మకాలు డెబ్భయి శాతం మేరకు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ధరలు అందుబాటులో వస్తే తప్ప కొనుగోళ్లు పెరగవని వ్యాపారులు కూడా చెబుతున్నారు.
నేటి ధరలు...
బంగారం అంటే అందరికీ ఇష్టమైనా దానిని కొనుగోలు చేయడం కష్టంగా మారింది. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు వారే విముఖత చూపుతున్నారని, ధరలను చూసే వారు వెనుకంజ వేస్తున్నారని వ్యాపారులు అంగీకరిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ప్రకారం ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,440 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,670 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,10,900 రూపాయలకు చేరుకుంది.