Gold Price Today : బంగారం కొనుగోలు చేసే వారికి తీపికబురు.. నేడు ఎంత తగ్గిందంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది.

Update: 2025-04-28 03:54 GMT

బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో ఏ ఏడాదిలో చూడనంత తరహాలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆల్ టైమ్ హైకి గోల్డ్, సిల్వర్ రేట్లు చేరుకున్నాయనే చెప్పాలి. ఇటీవల పది గ్రాముల బంగారం ధర లక్షను టచ్ చేసి తిరిగి దిగి రావడం ప్రారంభించింది. అయితే వినియోగదారులు ఆశించినంత మేరకు ధరలు దిగిరాకపోవడంతో ఇంకా అమ్మకాలు ఊపందుకోలేదని వ్యాపారులు చెబుతున్నారు. అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు. అందుకే బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ కొనుగోలు చేయడానికి మాత్రం ఆసక్తిచూపడం లేదు.

ఆఫర్లు ప్రకటిస్తున్నా...
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. అక్షర తృతీయ కూడా ముందుంది. దీంతో జ్యుయలరీ దుకాణాలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక రకాలుగా ఆఫర్లను సిద్ధం చేశాయి. ఇన్ని గ్రాముల బంగారం కొంటే ఇంత వెండి ఉచితమని కొన్ని దుకాణాలు ఆఫర్ ఇస్తుండగా, తరుగు, మజూరీ ఛార్జీలు తీసుకోబోమంటూ మరికొన్ని జ్యుయలరీ షాపులు ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బంగారం, వెండి ధరలను చూసిన వారికి ఎవరికైనా వాటిని కొనుగోలు చేయాలంటే తగినంత స్థోమత అవసరం. తమ ఆర్థికస్థోమతను మించి బంగారాన్ని కొనుగోలు చేయాలని ఎవరూ అనుకోరు. అందుకే అమ్మకాలు ఇంకా పెరగలేదు.
ఈరోజు ధరలు...
బంగారం అంటే ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది. కొంత అప్పులు చేసి, లేకపోతే స్కీమ్ లు ద్వారా కట్టి సొంతం చేసుకున్నా పెద్ద భారం పడబోదని వినియోగదారులు భావించేవారు. కానీ నేడు మాత్రం బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేనంతగా పెరగడంతో వాటివైపు చూడటమే మానుకున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,010 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,200 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,11,800 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News