Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గింది... ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది.

Update: 2025-03-01 03:17 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం తగ్గుతుందేమోనని ఎదురు చూస్తున్న వారికి నిరాశే ఎదురవుతుంది. ఎన్నడూ లేనంతగా పది గ్రాముల బంగారం ధర 86 వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్షా నాలుగు వేల రూపాయలు పలుకుతుంది. ఇంత ధర పెట్టి కొనుగోలు చేయలేక వినియోగదారులు అనేక మంది జ్యుయలరీ దుకాణాల వైపు చూసేందుకు కూడా ఇష్టపడటం లేదు. సాధారణంగా పసిడికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలాంటిది సీజన్ లో నూ కొనుగోళ్లు లేక డిమాండ్ తగ్గడం పై వ్యాపారులు కూడా ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీజన్ నడుస్తున్నా...
పెళ్లిళ్ల సీజన్ చాలా రోజులు నడుస్తుంది. ఆగస్టు వరకూ సీజన్ ఉండటంతో ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు మెండుగా ఉంటాయి. శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తున్నప్పటికీ ధరలను చూసి కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. విదేశాల నుంచి బంగారం నిల్వలు తగినంత రాకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో ధరల పెరుగుదలకు కళ్లెం పడటం లేదు. అందుకే ఈ ఏడాది ప్రారంభం నుంచే ధరలు పెరుగుతున్నా దానిని కంట్రోల్ చేయడం ఎవరి చేతుల్లో లేకపోవడంతో అమాంతం పెరిగిపోయాయి.
సురక్షితమైనా...
బంగరానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పెట్టుబడి పెట్టే వారికి సురక్షితంగా ఉంటుంది. బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో నష్టం రాదన్నది అందరి నమ్మకం. అలాంటి బంగారం, వెండి కొనుగోలు చేయాలంటనే భయం వేస్తుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,590 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,830 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,04,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News