Gold Price Today : గుడ్ న్యూస్ అని అనుకోవడానికి లేదుగా.. ధరలు కొంత తగ్గాయ్ కానీ?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి.
బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. ధరలు గత రెండు నెలల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. రెండు నెలలుగా వేల రూపాయల ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బంగారం కొనుగోలు చేయాలని ఉన్నప్పటికీ ధరలను చూసి వెనకడుగు వేస్తున్నారు. బంగారం ధరలు ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ పెరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే ధరలు పెరగడంతో కొనుగోళ్లు కూడా బాగా మందగించాయని అంటున్నారు. గతంలో కొన్నిసార్లు పెరిగినా, మరికొన్ని సార్లు తగ్గేవని, ఇప్పుడు పెరగడమే తప్పించి భారీగా పెరుగుదల కనిపించడంతో వినియోగదారులు బంగారు ఆభరణాలను చూసేందుకు కూడా దుకాణాలకు రావడం లేదంటున్నారు.
తగ్గదని చెబుతన్నారే...
పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో ధరలు ఇప్పట్లో దిగి వచ్చే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అంచనా ప్రకారం తెలుస్తోంది. ఇంకా పెళ్లిళ్ల సీజన్ కొన్ని నెలల పాటు నడుస్తుండటం వల్ల ధరలు తగ్గే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఇక బంగారాన్ని కొనుగోలు చేయాలంటే సామాన్య, పేద మధ్య తరగతుల ప్రజలకు సాధ్యం కాదన్నది వాస్తవం. కేవలం కొన్ని వర్గాలకే బంగారం, వెండి పరిమితమవుతాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయిన తర్వాత తీసుకున్న నిర్ణయాల ప్రభావం కూడా బంగారం ధరల పెరుగుదలపై కనిపిస్తుందని చెబుతున్నారు. మరొక వైపు వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. డాలర్ తో రూపాయి తగ్గుదల కారణంగా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు.
స్వల్పంగా తగ్గి...
బంగారం అనేది ఎప్పటికీ డిమాండ్ తగ్గదని చెబుతున్నా, ప్రస్తుతం కొనుగోళ్లు తగ్గడంతో డిమాండ్ తగ్గినట్లే అనుకోవచ్చు. విదేశాల నుంచి బంగారు నిల్వలు రాకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి ఇంకా పెరిగితే తప్ప బంగారం, వెండి వస్తువులను ఇక కొనుగోలు చేసే అవకాశం లేదందటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,090 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,370 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,06,000 రూపాయలుగా కొనసాగుతుంది.