Gold Rates Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు ఆశించినంత స్థాయిలో లేవు. వినియోగదారులు కొనలేనంత ధరలు ఉండటంతో కొనుగోలుకు అనాసక్తి కనపరుస్తున్నారు. బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అలాగని అత్యధిక సొమ్ములు చెల్లించి కొనుగోలు చేయాలంటే భయపడిపోతారు. తమకు అందుబాటులో ధరలు ఉంటేనే కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తారు. బంగారంపై పెట్టుబడి సురక్షితమైనదని తెలిసినా ముందు కొనుగోలు చేయాలంటే అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేయడం అవసరమా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది. అందువల్లనే ధరలు పెరుగుతున్న సమయంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం ఎప్పుడూ ఉండేదే. అయితే ఇది కొంతకాలం మాత్రమే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
సీజన్ నడుస్తున్నా...
పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నా కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో వ్యాపారులు ఒకింత నిరాశ పడుతున్నారు. తరుగు మీద డిస్కౌంట్, పాత బంగారం ఇస్తే రాయితీ ఇలా అనేక రకాలుగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదనే చెప్పాలి. ఎందుకంటే తులం బంగారం ఇప్పటికే 87 వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్షా ఏడువేల వరకూ ఉంది. ఇంత సొమ్ము పోసి కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. తమ వద్ద ఉన్న డబ్బుతో వచ్చే బంగారు ఆభరణాలను చూసి వెనక్కుతగ్గుతున్నారు. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలకు బంగారం, వెండి ధరలు అందుబాటులో ఉంటేనే కొనుగోళ్లు కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి.
నేటి ధరలు...
బంగారం కొనాలంటే ఇప్పుడు లక్ష రూపాయలకు పైగానే అవసరం. అంత డబ్బు పెట్టి కొనుగోలు చేయలేని వారు అటు వైపు చూడటం లేదు. అందుకే జ్యుయలరీ దుకాణాలు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,760 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,06,900 రూపాయలుగా నమోదయింది.