Gold Price Today : గుడ్ న్యూస్ .. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజే కొనేయండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.

Update: 2025-02-16 03:52 GMT

బంగారం ధరలకు పెరగడమే తెలుసు. తగ్గడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది. ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్న బంగారం ధరలు క్రమంగా దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లు కూడా అంతేస్థాయిలో తగ్గాయి. కొనుగోళ్లు తగ్గడంతో బంగారం వ్యాపారులు తమ వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలపై పది గ్రాములపై ఒక వెయ్యిరూపాయలు తగ్గించి విక్రయిస్తున్నప్పటికీ కొనుగోళ్లకు ఎక్కువ మంది ఆసక్తి కనపర్చడం లేదు. దీనికి ప్రధాన కారణం బంగారాన్ని అంత ఖర్చు చేసి కొనుగోలు చేయడం తమవల్ల కావడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధరలు 86 వేల రూపాయలకు చేరుకున్నాయి. కిలో వెండి ధర 1,05,000 రూపాయలుగా ఉంది.

పెళ్లిళ్ల సీజన్లో...
పెళ్లిళ్ల సీజన్లో ధరలు మరింత పెరుగుతాయని ముందుగానే అంచనా వేసుకున్న కొందరు అంతకు ముందే కొనుగోలు చేశారు. కొందరు వినియోగదారులు శుభకార్యాలకు అవసరమైన బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నా అతి కొద్ది మంది మాత్రమేనని వ్యాపారులు చెబుతున్నారు. గత సీజన్ లో ఈ పాటికి బంగారు ఆభరణాల స్టాక్ పూర్తిగా అయిపోయేదని, కొత్త స్టాక్ తెప్పించేవారమని,కానీ ఈ సీజన్ లో ఉన్న స్టాక్ సేల్ కావడమే కష్టంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. తరుగు, ఆభరణాల తయారీలో కొంత తగ్గింపుతో ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
ధరలు తగ్గి...
గతంలో స్టేటస్ సింబల్ గా భావించిన వారు సయితం ధరలు చూసి వెనక్కు తగ్గుతున్నారు. అదే సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి పెట్టుబడిగా పెట్టేవారు సయితం ముందుకు రావడం లేదనివ్యాపారులు చెబుతున్నారు. వచ్చే కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,900 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,070 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,00,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News