Godl Price Today : మరో ఐదారు నెలలు ఇంతే.. బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ధరలు తగ్గుతాయన్న ఆశలు లేవు. పైగా సీజన్ కావడంతో ధరలు తగ్గకపోగా మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గడం అంటూ జరిగినా కొద్దిగానే తగ్గుతాయి. అదే పెరిగితే భారీ మొత్తంలో పెరుగుతాయి. ప్రతి రోజూ బంగారం, వెండి ధర్లలో మార్పులు, చేర్పులు ఉంటాయి. ధరలు పెరగడానికి, తగ్గడానికి అనేక కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ మారుతుంటాయి. ధరలు పెరుగుతాయని, వచ్చే ఏడాదికి పది గ్రాముల బంగారం లక్షకు చేరుకుంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.
సీజన్ లో మరింతగా...
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. పది గ్రాముల బంగారం ధర 87 వేల రూపాయలకు చేరువలో ఉంది. కిలో వెండి ధరల లక్ష ఏడు వేలకు దగ్గరగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ మరో రెండు నెలల పాటు నడుస్తుంది. మాఘమాసంలో ఎక్కువగా పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతాయి. రానున్న ఆరు నెలల పాటు బంగారం ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. అందుకే మరింతగా ధరలు పెరగకుండా ముందుగానే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి. పెట్టుబడిగా బంగారాన్ని చూసే వారు సయితం కొంత వెనుకంజ వేసినా తగ్గుదల కోసం వెయిట్ చేయడం అంత మంచిది కాదని వ్యాపారులు కూడా చెబుతున్నారు.
తగ్గిన ధరలు...
బంగారం, వెండి ధరలు పెరిగినంత మాత్రాన డిమాండ్ తగ్గుతుందని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటే దానిని స్టేటస్ సింబల్ గానే చూస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళితే బంగారం ఆభరణాలు మెడలో వేసుకుని వెళితే తప్ప గౌరవం దక్కదన్న భావన ఈ జనరేషన్ లోనూ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ధరలు పెరిగినా గిరాకీ తగ్గని ఏకైక వస్తువు బంగారం మాత్రమే. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,660 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,06,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.