Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ పసిడిని సొంతం చేసుకునేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తుంటారు. తమకున్న కొద్దిపాటి సొమ్ముతోనైనా పసిడిని కొనుగోలు చేయాలని తపన పడుతుంటారు. కానీ అది ఒకప్పుడు. బంగారం ధరలు అందుబాటులో ఉన్న సమయంలో ఈ రకమైన భావన అందరిలోనూ ఉండేది. కానీ రాను రాను ధరలు పెరిగిపోవడంతో బంగారం తమకు అందనంత దూరంలో ఉందని డిసైడ్ అయిపోయారు. అందుకే రారమ్మంటున్నా దాని వైపు చూడటానికే మహిళలు జంకుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే మరేదైనా కొనుగోలు చేయడం సులువుగా భావించడం ఇటీవల కాలంలో ఎక్కువయింది.
అవసరమైనంత మేరకే...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయి నెల రోజులకు పైగానే గడుస్తుంది. మరో నాలుగైదు నెలలు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. అనేక శుభకార్యాలు జరుగుతున్నాయి. భారతీయ సంస్కృతిలో శుభకార్యాలకు బంగారం, వెండి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సంప్రదాయంగా మారింది. పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం కావడంతో ఖచ్చితంగా పెళ్లిళ్లలో పసడి ధగధగలు కనపడుతుంటాయి. కానీ నేడు పెరిగిన ధరలతో పెళ్లిళ్లకు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం మానుకున్నారనే అనుకోవాలి. పెళ్లికి అయ్యే ఖర్చు బంగారం ధరలతో వధువు కుటుంబానికి ఖర్చు తడిసిమోపెడంతవుతుంది. అందుకే బంగారం స్థానంలో మరొకటి ఇస్తామంటూ చెబుతూ అవసరమైనంత వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
భారీగా తగ్గడంతో..
ధరలు పెరగడంతో బంగారం స్టేటస్ సింబల్ గా మారింది. బంగారం ఉంటే చాలు అన్న భరోసా మొన్నటి వరకూ కలిగేది. కానీ నేడు కొనుగోలు చేసే విషయంలో సందిగ్దత నెలకొంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై మూడు వందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటల వరకూ ఇలా నమోదయ్యాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,890 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,150 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,08,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.