Gold Price Today : గుడ్ న్యూస్ బంగారం ధరలు దిగివస్తున్నాయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. ఎప్పుడూ ఈ స్థాయిలో ధరలు పెరగలేదు. ఇంత ధరలు పెరగడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. బంగారం దుకాణాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సీజన్ లో కిటకిటలాడే బంగారు దుకాణాలు నేడు ఎవరూ లేక వెలవెల బోతున్నాయి. అరకొర వస్తున్నప్పటికీ ధరలను చూసి భయపడి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. కొందరు పెళ్లిళ్ల వంటి కార్యక్రమాలకు బంగారం తప్పనిసరి గా కొనుగోలు చేయాలన్నా తక్కువ మొత్తంలో కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. అదీ ఎంతగా అంటే వీలయినంత తక్కువ బరువు ఉండేలా వచ్చే వారు జాగ్రత్తలు పడుతున్నారు. బంగారం పై అంత ధరలు పెట్టడం ఇష్టం లేక వినియోగదారులు వెనుకంజ వేస్తున్నారు.
భారీగా పెరగడంతో...
బంగారం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. దానిని కొనుగోలు చేసి సొంతం చేసుకోవడానికే తపన పడుతుంటారు. అలాంటిది ధరలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర 89 వేల రూపాయల వరకూ ఉంది. కిలో వెండి ధర లక్షా ఏడు వేలకు చేరుకుంది. ఈ ధరలు పెరగడానికి బంగారం ఎగుమతులు తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా జరిగే పరిణామాలతో పాటు విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇలా పెరిగి పోతుంటే ఉన్న బంగారం కూడా అమ్ముడు కావడం కష్టమేనని వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
ధరలు తగ్గినా...
కార్పొరేట్ సంస్థలు కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రాబట్టుకోలేకపోతున్నాయి. సీజన్ లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక అన్ సీజన్ లో తమ పరిస్థితి ఏంటని వారు కూడా ఆందోళనలో ఉన్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 450 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగరారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,250 రూపాయలకు గా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 88,100 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,07,900 ట్రెండ్ అవుతుంది.