Gold Rates Toady : నగలు కొనాలంటే ఇదే శుభసమయం.. ధరలు దిగివచ్చాయిగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఎక్కువవుతాయని అందరూ చెబుతున్నారు. శ్రావణమాసం కావడంతో ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సీజన్ కాని ఆషాఢ మాసంలోనే బంగారం ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. అలాంటిది బాగా డిమాండ్ ఉండే పెళ్లిళ్ల సీజన్ లో ధరలు ఇక ఎం పెరుగుతాయోనని అని కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు. సహజంగా ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగినప్పుడు ధర పెరుగుతుంది. డిమాండ్ లేనప్పుడు ధరలు తగ్గుతాయి. కానీ బంగారం విషయంలో మాత్రం అలా జరగడం లేదు. పూర్తిగా రివర్స్ లో జరుగుతుంది. డిమాండ్, సీజన్ తో సంబంధం లేకుండానే పుత్తడి ధరలు పెరగడం సర్వసాధారణమయింది.
సీజన్ లో తగ్గుతూ...
సాధారణంగా ఆషాఢమాసంలో బంగారం, వెండి వస్తువులను ఎవరూ కొనుగోలు చేయరు. ఇప్పటికే మూడు సార్లు లక్ష రూపాయలను టచ్ చేసిన బంగారం ధరలు వినియోగదారులకు షాకిచ్చాయి. అలాగని కొనుగోలు చేయడం ఎవరి వల్ల కాని పరిస్థితుల్లోనూ బంగారం ధరలు పెరుగుతూనే పోయాయి. డిమాండ్ లేకపోయినా, సీజన్ కాకపోయినా ధరలు అమాంతం పెరగడంతో ఇక సీజన్ ప్రారంభమయిన తర్వాత ధరలు ఏ రేంజ్ కు వెళతాయోనన్న భయం అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే కొనుగోలు చేయలేని స్థితికి చేరుకున్న బంగారం, వెండి ధరలు ఇంకెంత పెరుగుతాయన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఇక జ్యుయలరీ దుకాణాలు తరుగు, జీఎస్టీ వంటి పన్నులతో ధరలు మరింత పెంచేస్తున్నారు.
ధరలు తగ్గి...
బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరలు పెరుగుతూనే ఉండటంతో లక్ష దాటేసిన బంగారం శ్రావణ మాసం ప్రారంభం అయిన తర్వాత మాత్రం ధరలు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయి. మళ్లీ లక్షకు బంగారం దిగువకు చేరింది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 540 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై 1,900 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,600 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,930 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,26,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.