Gold Rates Today : గుడ్ న్యూస్ లక్ష నుంచి దిగి వచ్చిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది

Update: 2025-06-25 03:27 GMT

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే అంతేస్థాయిలో పతనమవుతాయన్న అంచనాలు కూడా నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధర ఇంత భారీగా తగ్గడమే ఇందుకు కారణం. బంగారం అంటే మక్కువ లేనిది ఎవరికి? తమకు ధరలు అందుబాటులో ఉంటే మాత్రం కసితీరా కొనుగోలు చేసే మనస్తత్వం మహిళలది. అదే సమయంలో ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో నీరసంగా బేల చూపులు చూసేదీ వాళ్లే. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేస్తేనే అమ్మకాలు జోరుగా కొనసాగుతాయి. తయారు చేసిన ఆభరణాలు వెంటనే అమ్ముడు పోతే కొత్త స్టాక్ వస్తుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ధరలు పెరగడమే కాని తగ్గడం లేదు.

భారీగా పెరుగుతాయని...
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే గత కొన్నాళ్లుగా కొనుగోళ్లు కూడా నిలిచాయి. వ్యాపారులు లబోదిబోమనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం గృహ ప్రవేశాల ముహూర్తాలు నడుస్తుండటంతో బంగారం, వెండి వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ట్రంప్ నిర్ణయాలు, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం ధరల్లో భారీ మార్పులు సంభవించాయి. అయితే ఇరాన్ - ఇజ్రాయిల్ ల మధ్య శాంతి చర్చలు సక్సెస్ కావడంతో బంగారం ధరలు కొంత దిగిరావడానికి కారణాలున్నాయని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ చెబుతున్నారు.
నేటి ధరలు ఇలా...
బాగా అమ్ముడు కావాల్సిన పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు జ్యుయలరీ దుకాణాలను దెబ్బేశాయి. పెద్దగా ఆశించనంత మేరకు అమ్మకాలు జరగలేదని, కార్పొరేట్ దుకాణాలు సయితం కూడా నిర్వహణ ఖర్చులు కూడా రాకుండా ఇబ్బంది పడ్డాయని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 1,600 రూపాయల వరకూ తగ్గింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,940 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,360 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,18,900 రూపాయలుగా కొనసాగుతుంది.



Tags:    

Similar News