Gold Price Today : గుడ్ న్యూస్... పసిడి ప్రియులకు పండగే

ఈ రోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా అదే తగ్గుదల కనిపించింది

Update: 2025-03-02 03:40 GMT

బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ ధరలు తగ్గడం అనేది జరగదు. తగ్గినా తక్కువ మొత్తంలో తగ్గుతుంటాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అదే ధరలు పెరుగుదల విషయంలో మాత్రం ఈ సూత్రం పాటించదు. భారీగా ధరలు పెరుగుతాయి. వందల్లోనే ధరలు పెరిగి కొనుగోలు దారులను నిరాశకు గురి చేస్తాయి. అయితే ఇటీవల కాలంలో వరసగా ధరలు పెరుగుతుండటం కొంత ఆందోళనకు వినియోగదారులు గురవుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయాలంటేనే భయపడిపోతున్నారు. బంగారం, వెండి వస్తువులు ఇక మన సొంతం కావన్న డిసైడ్ అయిపోయారు.

కొనుగోళ్లు తగ్గడంతో...
ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుండటంతో పాటు ఆగస్టు నెల వరకూ కొనసాగుతుండటంతో ధరలు దిగి వచ్చినా కొంతే తప్ప తమకు అందుబాటులో రావని కొనుగోలుదారులు ఫిక్స్ అయిపోయారు. అందుకే బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండిపోయారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే ధరలు పెరగడంతో జ్యుయలరీ దుకాణాల వైపు కూడా ఎవరూ చూడటం లేదు.
భారీగా తగ్గిన...
దీంతో అనేక బంగారు దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎప్పుడో తెప్పించిన స్టాక్ అలాగే ఉండిపోయింది. అనేక రాయితీలు, ఆఫర్లు ప్రకటించినా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వ్యాపారులు కూడా ధరలు మరింత తగ్గాలని కోరుకుంటున్నారు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా అదే తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,840 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,05,000 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News