Gold Price Today : ఇదేంది మామా.. బంగారం ధరలు తగ్గకపోయెనే

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి

Update: 2025-04-20 03:22 GMT

బంగారం ధరలు ఎంత ఎక్కువగా పెరిగితే అంత డిమాండ్ ఉన్నట్లు. అయితే ప్రస్తుతం డిమాండ్ తో సంబంధం లేకుండా ధరలు పెరుగుతున్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. అనేక కారణాలు బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ట్రంప్ పెంచుతున్న సుంకాలు, నిర్ణయాల ప్రభావంతో పాటు అమెరికా, చెన్నై ట్రేడ్ వార్ కూడా బంగారం, వెండి ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు బిజినెస్ ఎక్స్ పెర్ట్స్. ఇదే జరిగితే ఇంకా ధరలు పెరుగుతాయని, తగ్గుతాయని అనుకోవడం అవివేకమేనంటున్నారు మార్కెట్ నిపుణులు. అందుకే పెట్టుబడి పెట్టేవారు హ్యాపీగా కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.

తగ్గుతుందని వెయిట్ చేస్తే...
తగ్గుతుందని వెయిట్ చేస్తే ధరలు మరింత పెరిగే అవకాశమే తప్ప తగ్గే ఛాన్స్ లేదని చెబుతున్నారు. మరొక వైపు ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. వెండి ధర లక్షా పదివేలకు చేరింది. ఇంత ధరలు పెరగడం ఇటీవల కాలంలో ఎన్నడూ జరగలేదని, ఇంకా ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఈ నెలతో పాటు జూన్ నెల వరకూ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మరోవైపు అక్షర తృతీయ కూడా ఉండటంతో ధరలు ఇంకా పెరుగుతాయి అని అంచనాలు వినపడుతున్నాయి. లక్ష రూపాయలు చేరుకోవడానికి ఇంకా రోజులు సమయం మాత్రమే ఉందని అంటున్నారు. అందుకే బంగారం మరింత భారంగా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
స్థిరంగా నేటి ధరలు...
ధరలు పెరిగినంత మత్రాన బంగారానికి ఉన్న క్రేజ్ పడిపోతుందని మాత్రం అనుకోలేమని అంటున్నారు వ్యాపార నిపుణులు. ఎందుకంటే ఎంత ధరలు పెరిగినా తమకు కావాల్సిన, అవసరమైన సమయంలో సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి విధిగా బంగారాన్ని వెండిని కొనుగోలు చేస్తుంటారని, అది భారతీయుల ప్రత్యేకత అని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు మాత్రమే ఇవి. మధ్యాహ్నానికి మారే ఛాన్స్ ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,450 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,580 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 1,10,000 రూపాయలకు చేరుకుంది.




Tags:    

Similar News