Gold Rates Today: గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు తగ్గితే ఆనందం. పెరిగితే ఆవేదన. ఇది గత ఆరు నెలలుగా ఎక్కువ రోజులు పసిడిప్రియులు ఆవేదనతోనే గడిపారు. ఎందుకంటే ఈ ఏడాది జనవరి ఆరంభం నుంచి మొన్నటి వరకూ ఆవేదన ఎక్కువగా కనపడింది. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటేయటం అంటే మాటలా? నిజానికి మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు చేరుకోవడానికి వచ్చే ఏడాది పడుతుందని అంచనా వేశారు. కానీ ఈ ఏడాది మార్చి నెలలోనే లక్ష రూపాయలు దాటేయడంతో వారి అంచనాలు కూడా నిజం కాలేదు. అలాగే ఇప్పుడు లక్ష రూపాయల నుంచి దిగువకు ధరలు దిగి వచ్చినా ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదంటున్నారు.
దక్షిణ భారతంలోనే...
గోల్డ్ అంటే అత్యంత ఇష్టపడే వారు ప్రపంచంలోనే భారతీయులు అత్యధికంగా ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని మహిళలు బంగారం కొనుగోలు కోసం పరితపించి పోతుంటారు. పండగ, పుట్టిన రోజుకు కూడా బంగారం కొనుగోలుచేయాలన్న తపన వారికి ఎక్కువ కనపడుతుంది. తెలంగాణ, ాఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బంగారం సేల్స్ ఎక్కువగా ఉంటాయని వ్యాపారులు కూడా చెబుతారు. ఇక ముహూర్తాలు, పెళ్లిళ్ల సీజన్ లో అయితే చెప్పాల్సిన పనిలేదు. జ్యుయలరీ దుకాణాల్లో కాలు మోపడానికి కూడా అవకాశముండదు. అలాంటిది గత ఆరు నెలలుగా బంగారం దుకాణాలు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి.
నేటి ధరలు...
పెరుగుతున్న ధరలతో పాటు దుకాణాల యాజమాన్యం వేస్తున్న తరుగు, ప్రభుత్వం వేస్తున్న జీఎస్టీ వంటి వాటితో బంగారం ధరలు మరింతగా పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు చేయలేక చాలా మంది పెళ్లి తంతు ముగించేశారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,690 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,940 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,17,900 రూపాయలుగా కొనసాగుతుంది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు.